- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
9 నెలల చిన్నారికి కరోనా.. బెంగళూరులో వెలుగు చూసిన కేసు!
by Phanindra |
9 నెలల చిన్నారికి కరోనా సోకిన ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. అయితే చిన్నారి ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉన్నట్లు వైద్యులు చెప్పారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరులో 9 నెలల చిన్నారికి కరోనా సోకింది. హస్కోటెకు చెందిన ఆ చిన్నారి ప్రస్తుతం కలసిపాల్యలోని వాణీ విలాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ద్వారా మే 22వ తేదీన చిన్నారికి కరోనా సోకినట్లు గుర్తించినట్లు కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ హర్ష్ గుప్తా వెల్లడించారు. ప్రస్తుతం ఈ చిన్నారి మెడికల్ అబ్జర్వేషన్‌లో ఉన్నట్లు, తన ఆరోగ్యం స్థిరంగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో ఇప్పటి వరకు 16 కేసులు నమోదవగా.. కేరళలో అత్యధికంగా 182 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అడ్వైజరీలు విడుదల చేశాయి.
Next Story






