Maoists : చత్తీస్ గఢ్ లో 9మంది మవోయిస్టుల లొంగుబాటు

by Y. Venkata Narasimha Reddy |

చత్తీస్ గఢ్ (Chhattisgarh)రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేతకు ఒకవైపు సాయధ బలగాలు ఆపరేషన్ కగార్ పేరుతో అడవులను జల్లెడ పడుతుండగా, ఇంకోవైపు మావోయిస్టుల లొంగుబాటు పథకాల(surrender Schemes)ను కూడా ప్రోత్సహిస్తున్నారు.

Maoists : చత్తీస్ గఢ్ లో 9మంది మవోయిస్టుల లొంగుబాటు
X

దిశ, వెబ్ డెస్క్ : చత్తీస్ గఢ్ (Chhattisgarh)రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేతకు ఒకవైపు సాయధ బలగాలు ఆపరేషన్ కగార్ పేరుతో అడవులను జల్లెడ పడుతుండగా, ఇంకోవైపు మావోయిస్టుల లొంగుబాటు పథకాల(surrender Schemes)ను కూడా ప్రోత్సహిస్తున్నారు. సుక్మా జిల్లా(Sukma District)లో ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా 9 మంది మావోయిస్టులు(9 Maoists surrender) ఎస్పీ కిరణ్ చవాన్(SP Kiran Chavan) ఎదుట లొంగిపోయారు.

ఇద్దరు మావోయిస్టులకు ఒక్కొక్కరికి రూ.8 లక్షలు, నలుగురికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల రివార్డు ఉండగా.. లొంగిపోయిన మావోయిస్టుల మొత్తం రివార్డు రూ.43 లక్షలను వారికి అందించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు వారితో కలిసి భోజనం చేసి.. వారికి నూతన వస్త్రాలతో పాటు స్వీట్లు, రివార్డు చెక్కులను అందించారు. ప్రభుత్వం తరుపునా వారికి పునరావస పథకం కింద అందించాల్సిన అన్ని సహాయక చర్యలు తీసుకుంటామని ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు.

Next Story