- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pak: పాక్ మిలిటరీ కంటోన్మెంట్‌లో భారీ బాంబు పేలుళ్లు
ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారని పోలీసులు తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్‌లోని ఆర్మీ కంటోన్మెంట్‌లో మంగళవారం బాంబు పేలుళ్లు సంభవించాయి. ఉగ్రవాద సంస్థకు చెందిన ఆత్మాహుతి బాంబర్లు ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బన్నూ కంటోన్మెంట్ పరిధిలోని ఆర్మీ కాంపౌండ్‌లోకి రెండు పేలుడు పదార్థాలతో కూడిన కార్లను పోనివ్వడంతో భారీ పేలుళ్లు జరిగాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారని పోలీసులు తెలిపారు. మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. రెండుసార్లు జరిగిన ఈ పేలుళ్ల కారణంగా 20 మంది గాయపడ్డారని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. దాడి తీవ్రత కారణంగా ఆ ప్రాంతంలో ఎనిమిది ఇళ్లు దెబ్బతిన్నాయి. ఆత్మాహుతి దాడికి కారణమైన ఇద్దరితో పాటు ఆరుగురు మిలిటెంట్లు ఎదురుకాల్పుల్లో చనిపోయారు. ఆత్మాహుతి దాడి జరిగిన తర్వాత 12 మంది దాకా ఉగ్రవాదులు కంటోన్మెంట్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ దాడి తామే చేశామని హఫీజ్ గుల్ బహదూర్ టెర్రరిస్ట్ సంస్థ క్లెయిమ్ చేసింది. ఈ సంస్థ 2001 నుంచి అమెరికా నేతృత్వంలోని నాటో సంకీర్ణానికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో ఆఫ్ఘన్ తాలిబాన్‌కు మద్దతు ఇచ్చింది.






