- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎనిమిదో తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకం విడుదల.. వారం రోజుల్లో అందుబాటులోకి!
న్యాయవ్యవస్థలో అవినీతి అంశాలపై వివాదం నేపథ్యంలో ఎన్‌సీఈఆర్‌టీ ఉపసంహరించుకున్న 8వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకాన్ని తిరిగి సవరించారు.

దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద అంశాల కారణంగా విత్‌డ్రా చేసుకున్న ఎనిమిదో తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకాన్ని ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) ఎట్టకేలకు సవరించింది. న్యాయ వ్యవస్థలో అవినీతికి సంబంధించిన ఓ విభాగాన్ని నిపుణుల కమిటీ సమీక్షించిన అనంతరం, సవరించిన పుస్తకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వారం రోజుల్లోనే ఈ పుస్తకం విద్యార్థులకు అందుబాటులోకి రానుందని ఎన్‌సీఈఆర్‌టీ అధికారులు వెల్లడించారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు వివాదాస్పద విభాగాలను తొలగించి, అవసరమైన మార్పులు చేశారు. సవరించిన ఈ పాఠ్యాంశం నిష్పాక్షికంగా, విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని కమిటీ ధృవీకరించడంతో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసేందుకు అడ్డంకులన్నీ తొలిగిపోయాయి.
కాగా, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 8వ తరగతి పాఠ్యాంశంలో న్యాయ వ్యవస్థలో అవినీతి అంశాన్ని ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆ అంశం అందరినీ కలవరానికి గురిచేసిందని, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని ధర్మాసనం ఫైర్ అయింది. దీంతో ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) దిద్దుబాటు చర్యలకు దిగి ప్రచురించిన పుస్తకాలను రీకాల్ చేసింది. అనంతరం నిపుణుల కమిటీ పర్యవేక్షణలో మరో కొత్త పుస్తకం విడుదలకు లైన్ క్లియర్ అయింది.






