దేశంలో 81 శాతం నాన్ వెజ్ ప్రియులే... ఏపీ, తెలంగాణలో ఎంతశాతం ఉన్నారంటే?

by Ajay Maddhiboyina |

బ‌క్రీద్ వేళ సోష‌ల్ మీడియాలో మాంస‌హారులు, శాకాహారుల మ‌ధ్య పెద్ద చ‌ర్చ మొద‌లైంది. ఇండియాలో ప్ర‌తిరోజు మాంసాహారం

దేశంలో 81 శాతం నాన్ వెజ్ ప్రియులే... ఏపీ, తెలంగాణలో ఎంతశాతం ఉన్నారంటే?
X

దిశ‌, వెబ్ డెస్క్: బ‌క్రీద్ వేళ సోష‌ల్ మీడియాలో మాంస‌హారులు, శాకాహారుల మ‌ధ్య పెద్ద చ‌ర్చ మొద‌లైంది. ఇండియాలో ప్ర‌తిరోజు మాంసాహారం తింటున్నార‌ని కేవ‌లం బ‌క్రీద్ స‌మ‌యంలో మాత్ర‌మే ఎందుకు శాకాహారం గురించి మాట్లాడ‌తారు అంటూ కొందరు మాంసాహారులు అంటున్నారు. ఈ సంద‌ర్భంగా నేష‌న‌ల్ హెల్త్ ఫెసిలిటీ విడుద‌ల చేసిన స‌ర్వే రిపోర్టు షేర్ చేస్తున్నారు. ఈ స‌ర్వే ప్ర‌కారం ఇండియాలో 81శాతం మంది ప్ర‌జ‌లు నాన్ వెజ్ తింటుండ‌గా కేవ‌లం 19 శాతం మంది ప్ర‌జ‌లు మాత్ర‌మే శాకాహారులుగా ఉన్నారు.

రాష్ట్రాల వారిగా చూసుకుంటే గుజ‌రాత్, పంజాబ్, రాజ‌స్థాన్, హ‌ర్యాణాలో మాత్ర‌మే 50 శాతం కంటే త‌క్కువ‌గా శాకాహారులు ఉన్నారు. మిగితా అన్ని రాష్ట్రాల్లో కూడా 50 శాతం పైనే నాన్ వెజ్ ల‌వ‌ర్స్ ఉన్నారు. సౌత్‌లోని అన్ని రాష్ట్రాల్లోనూ నాన్ వెజ్ తినేవారి సంఖ్యనే ఎక్కువగా ఉంది. దాదాపు సౌత్ రాష్ట్రాల్లో 90శాతం పైనే నాన్ వెజ్ తినేవాళ్లు ఉన్నారు. అందులో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో నాన్ వెజ్ లవర్స్ సంఖ్య సమానంగా 97.3 శాతం ఉంది.

Next Story