24 గంటల్లో 81 మంది మృతి

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-29 06:34:27  IST  )

హమాస్‌ను తుదముట్టించే చర్యల్లో భాగంగా.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి.

24 గంటల్లో 81 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: హమాస్‌ను తుదముట్టించే చర్యల్లో భాగంగా.. గాజాపై (Gaza) ఇజ్రాయెల్ (Isreal) దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో గత 24 గంటలో 81 మంది పాలస్తీనియన్లు మరణించగా, 422 మంది గాయాల పాలయ్యారు. గాజా నగరంలోని పాలస్తీనా స్టేడియంలో ఆశ్రయం పొందుతున్న 12 మంది శరణార్థులు సైతం ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక ఈ దాడులు ప్రధానంగా అల్-టుఫ్ఫాహ్, అల్-మావాసీ, బురేజి వంటి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. వరుసగా జరిగే గగనదాడుల వల్ల గాజా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

కాగా, దాదాపు రెండున్నర నెలలుగా గాజాను పూర్తిగా దిగ్బంధించిన ఇజ్రాయెల్‌ సైన్యం నెల క్రితం ఆహార పంపిణీ కేంద్రాలను ప్రారంభించింది. ఆహారాన్ని పంపిణీ చేసే ట్రక్కుల వైపు మంగళవారం వందలాది మంది ప్రజలు వస్తుండగా సైన్యం డ్రోన్లతో దాడులు జరుపటంతో 25 మంది పాలస్తీనియన్లు చనిపోగా వందలాదిగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తీవ్రంగా స్పందించారు. ఇజ్రాయెల్ కావాలనే కాల్పులు జరిపిందనే ఆరోపణలను ఖండించారు. జనంపై ఆర్మీ ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరుపుతోందంటూ వచ్చిన వార్తలపై దర్యాప్తునకు ఆదేశిస్తామన్నారు.

Next Story