ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-15 15:26:20  IST  )

ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మువానిలోని సుని వంతెన వద్ద ఓ వాహనం లోయలో పడింది.

ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మువానిలోని సుని వంతెన వద్ద ఓ వాహనం లోయలో పడింది. ప్రమాద సమయంలో వాహనంలో ఉన్న 13 మందిలో ఎనిమిది మంది అక్కడిక్కడే దుర్మరణం(8 People Dead) చెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story