- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Syria: సిరియాలో ఉద్రిక్తతలు.. సురక్షితంగా బయటపడ్డ 75 మంది భారతీయులు
సిరియాను (Syria rebels) రెబల్స్ తమ అధీనంలోకి తీసుకున్నారు. అధ్యక్షుడు బషర్-అల్ అసద్ (Bashar Al-Assad) దేశాన్ని వీడి వెళ్లారు.

దిశ, నేషనల్ బ్యూరో: సిరియాను (Syria rebels) రెబల్స్ తమ అధీనంలోకి తీసుకున్నారు. అధ్యక్షుడు బషర్-అల్ అసద్ (Bashar Al-Assad) దేశాన్ని వీడి వెళ్లారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు వేళ అక్కడున్న భారతీయుల గురించి ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా.. వారిని వెనక్కి రప్పించేందుకు భారత విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా 75 మంది భారత పౌరులను డమాస్కస్ నుంచి లెబనాన్ (Lebanon)కు సురక్షితంగా తీసుకొచ్చింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రకటించింది. మొత్తం 75 మంది భారతీయుల్లో 44 మంది జమ్మూకశ్మీర్‌కు చెందిన జైరిన్ (యాత్రికులు)లు ఉన్నారని అధికారులు తెలిపారు. వారంతా కమర్షియల్ ఫ్లైట్ల ద్వారా లెబనాన్ నుంచి త్వరలోనే భారత్ చేరుకోనున్నట్లు పేర్కొన్నారు. చాలా మంది భారతీయులు సిరియాలో చిక్కుకున్నట్లు తెలిపారు. వారంతా డమాస్కస్‌లోని రాయబార కార్యాలయంతో +963 993385973 వాట్సప్‌లో, [email protected] ఇ-మెయిల్ ద్వారా టచ్‌లో ఉండాలని సూచించారు.
రెబల్స్ చేతిలోకి సిరియా
సిరియా (Syria) దేశ రాజధాని డమాస్కస్‌తో సహా పలు నగరాలను రెబల్స్ ఆక్రమించుకున్నారు. దీంతో అసద్ తన కుటుంబంతో సహా రష్యాకు శరణార్థిగా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన మాస్కోలో ఉన్నారు. అధికార బదిలీపై రెబల్స్ తో చర్చలు జరిపాకే అసద్ సిరియాను వీడారని రష్యా ప్రభుత్వం తెలిపింది. ఇక, అసద్ సిరియాను వీడిన వెంటనే నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిందని రెబల్స్ సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ రెబల్స్ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయి.






