- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఒక్క సంతకంతో 7.25 లక్షల మంది భారతీయుల్లో వణుకు
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు అనేక సంచనాల నిర్ణయాలు తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు అనేక సంచనాల నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా చేసిన ఒక్క సంతకం ఇప్పుడు అక్కడి లక్షలాది మంది విదేశీయులను వణికిస్తోంది. అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వారిని వెంటనే వెనక్కి పంపాలని ట్రంప్ ప్రకటించటంతో వారంతా గుబులు చెందుతున్నారు. తాత్కాలిక వీసాలపై వచ్చిన వారి పరిస్థితి సైతం ఇదే.
ఇక, సరైన పత్రాల్లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారు దాదాపు 1.40 కోట్ల మంది ఉంటారని అంచనా. వీరిలో సుమారు 7.25 లక్షల మంది భారతీయులు ఉన్నారు. మెక్సికో, సాల్వెడార్ ప్రజల తర్వాత భారతీయులే ఎక్కువ మంది ఉన్నారు. ఎన్నికల ప్రచారం నుంచి ఇలాంటివారి విషయంలో ట్రంప్ పదేపదే తన వైఖరిని చెబుతూ వచ్చారు. అధికార బాధ్యతలు చేపట్టిన వెంటనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే, చట్టవిరుద్ధంగా నివసిస్తున్న విదేశీ పౌరులను అందర్నీ గుర్తించి.. వారిని తిరిగి వారి వారి దేశాలకు పంపించేందుకు ట్రంప్ యంత్రాంగం చర్యలు మొదలుపెట్టింది.
అంతేకాదు, అమెరికా గడ్డపై పుట్టిన ఇతర దేశాలవారికి జన్మతః లభించే పౌరసత్వాన్ని రద్దుచేయాలని ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల భారతీయులకు ఎక్కువ ఇబ్బంది కానుంది. చాలా మంది భారతీయులు తమ పిల్లలకు పౌరసత్వం పొందాలనే ఉద్దేశ్యంతో ప్రసవం కోసం అమెరికాకు వెళతారు. ట్రంప్ తాజా నిర్ణయంతో దీనికి బ్రేక్ పడనుంది. ఇక అమెరికా జనాభాలో సుమారు 50 లక్షల మంది అంటే 1.47 శాతం భారతీయులే ఉన్నారు. వీరిలో మూడోవంతు మంది అమెరికాలో పుట్టినవారు. మిగతావారంతా వలసదారులు. తాత్కాలిక వీసాపై అమెరికా వెళ్లి, గ్రీన్‌కార్డుకోసం వేచిచూస్తున్నవారికి పుట్టిన సంతానానికి ఇకపై అమెరికా పౌరసత్వం లభించదు.






