- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకే యువతిపై 700 మంది రేప్.. బ్రిటన్ పార్లమెంట్‌లో వణికించే నిజాలు
బ్రిటన్ పార్లమెంట్‌లో ఎంపీ రూపెర్ట్ లోవ్ చదివిన ‘గ్రోమింగ్ గ్యాంగ్స్’ బాధితుల సాక్ష్యాలు యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: బ్రిటన్ పార్లమెంట్‌లో జరిగిన ఓ డిబేట్ ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. యూకేలో గత కొంతకాలంగా కలకలం రేపుతున్న గ్రోమింగ్ గ్యాంగ్స్.. బాలికలను ట్రాప్ చేసి లైంగికంగా వేధించే ముఠాల దారుణాలపై ఎంపీ రూపెర్ట్ లోవ్ (Rupert Lowe) పార్లమెంట్‌లో సంచలన వివరాలను బయటపెట్టారు. బాధితులు స్వయంగా ఇచ్చిన సాక్ష్యాలను ఆయన బ్రిటన్ పార్లమెంట్ ఎగువ సభలో చదివి వినిపించడంతో సభ ఒక్కసారిగా వణికిపోయింది.
ఒకే యువతిపై 700 మంది అత్యాచారం..
ఎంపీ రూపెర్ట్ లోవ్ నేతృత్వంలోని స్వతంత్ర కమిషన్ సేకరించిన నివేదికల ప్రకారం.. బాధితులైన శ్వేతజాతీయులైన బ్రిటీష్ బాలికలు, మహిళల సాక్ష్యాలు కన్నీరు పెట్టించేలా ఉన్నాయి. ఓ బాధితురాలు ఇచ్చిన సాక్ష్యాన్ని సభలో చదువుతూ.. తనపై బహుశా 700 మంది వేర్వేరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు’ అని పేర్కొనడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఓ పసిపాప ముఖంపై నిందితులు సిగరెట్లు కాల్చి వాతలు పెట్టారని ఓ సాక్ష్యం చెప్పింది. తాను నేను కేవలం 12 లేదా 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మత్తు పానీయాల సీసాలను పగలగొట్టి మరీ నాపై క్రూరంగా దాడి చేశారని మరో బాధితురాలు వాపోయింది. పండుగల సమయాల్లో ఈ ముఠాల దారుణాలు మరింత ఎక్కువవుతాయని, పెద్ద ఎత్తున పార్టీలు చేసుకుంటూ బాలికలను చిత్రహింసలు పెట్టేవారని బాధితురాళ్లు తెలిపారు. దాడులు చేస్తున్న సమయంలో కూడా క్రైస్తవ విశ్వాసాలను అవహేళన చేస్తూ.. ‘ఇప్పుడు మీ దేవుడు ఎక్కడున్నాడు.. నిన్ను రక్షించడా?’ అంటూ మానసికంగా వేధించేవారని పేర్కొన్నారు.
పోలీసులపైనా తీవ్ర ఆరోపణలు
గ్రోమింగ్ గ్యాంగ్స్ నేరాలలో నిందితులే కాకుండా, బాధ్యతాయుతమైన అధికారుల పాత్ర కూడా ఉందని బాధితులు ఆరోపించడం సంచలనంగా మారింది. దేశంలోని వేర్వేరు ప్రాంతాలలో పలువురు పోలీస్ అధికారులు కూడా తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ బాధితురాలు ఆరోపించింది. బాలికలను కుక్కల బోనుల్లో బంధించి వ్యాన్లలో తరలించేవారని, అధికారులు ఇవన్నీ చూస్తూ కూడా కళ్లు మూసుకున్నారని నివేదికలో పేర్కొన్నారు.
జాత్యహంకార కోణం.. మతపరమైన ఆరోపణలు
ముస్లిం అమ్మాయిల కంటే శ్వేతజాతీయులైన అమ్మాయిల విలువ తక్కువంటూ నిందితులు వ్యాఖ్యానించేవారని, కేవలం ఓ నిర్దిష్ట సమాజానికి చెందిన యువతులనే టార్గెట్ చేశారని ఎంపీ రూపెర్ట్ లోవ్ తెలిపారు. అయితే, ఈ నివేదికపై బ్రిటన్ పార్లమెంట్‌లో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. కొంతమంది లేబర్ పార్టీ ఎంపీలు దీనిని ఇస్లామోఫోబియాగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా.. మెజారిటీ సభ్యులు బాధితులకు న్యాయం జరగాలని, ఇలాంటి దారుణమైన ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఉదంతం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.






