Bangladesh: బంగ్లాదేశ్ జైళ్ల నుంచి 700 మంది పరారీ

by Shamantha N |

బంగ్లాదేశ్‌ (Bangladesh)లో రిజర్వేషన్ అంశంపై అల్లర్లు చెలరేగినప్పుడు భారీ సంఖ్యలో ఖైదీలు జైళ్లను బద్దకొట్టి తప్పించుకుపోయారు.

Bangladesh: బంగ్లాదేశ్ జైళ్ల నుంచి 700 మంది పరారీ
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌ (Bangladesh)లో రిజర్వేషన్ అంశంపై అల్లర్లు చెలరేగినప్పుడు భారీ సంఖ్యలో ఖైదీలు జైళ్లను బద్దకొట్టి తప్పించుకుపోయారు. అందులో ఉగ్రవాదులు, ఉరిశిక్షపడిన హంతకులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, తప్పించుకుపోయిన వారిలో 700 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియట్లేదు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ అధికారులు బుధవారం వెల్లడించారు. పోలీసుశాఖ ప్రతినిధి ఇమామ్‌ హోసైన్‌ సాగర్‌ మాట్లాడుతూ పరారీలో ఉన్న ఖైదీల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే వీరి సమాచారం దేశంలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు పంపామన్నారు. ప్రధాని హసీనా దేశం వీడిన తర్వాత బెయిలు పొందిన ఉగ్రవాదులపై కూడా తమ నిఘా ఉందని చెప్పారు. దాదాపు 2,200 మంది తప్పించుకుపోగా.. అందులో 1500 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అయితే, పరారీలో ఉన్న 700 మంది ఖైదీల్లో 70 మంది వరకు ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన ఖైదీలే ఉన్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న ఖైదీల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే వీరి సమాచారం దేశంలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు పంపామని పోలీసుశాఖ ప్రతినిధి ఇమామ్‌ హోసైన్‌ సాగర్‌ తెలిపారు. ప్రధాని హసీనా దేశం వీడిన తర్వాత బెయిలు పొందిన ఉగ్రవాదులపై కూడా తమ నిఘా ఉందని చెప్పారు.

జైళ్లపై దాడి

ఇకపోతే, ఈ ఏడాది జులైలో అల్లర్ల సందర్భంగా ఢాకా నగరానికి తూర్పున ఉన్న నార్సింగిలోని జైలుపై వందల మంది దాడి చేసి నిప్పుపెట్టారు. ఆ తర్వాత చాలా మంది ఖైదీలను విడిపించారు. కొద్దిరోజుల తర్వాతే మరో నాలుగు జైళ్లపై కూడా దాడులు జరిగాయి. భయంకర నేరాలకు పాల్పడిన వారిని ఉంచే కషిమ్‌పుర్‌ జైలుపైనా దాడి చేశారు. అప్పటి ప్రధాని షేక్‌హసీనాపై తిరుగుబాటు సందర్భంగా జరిగిన ఆందోళనల్లో బంగ్లా వ్యాప్తంగా ఉన్న 2,200 మంది ఖైదీలు తప్పించుకున్నారు. వీరిలో దాదాపు 1500 మందిని భద్రతా దళాలు తిరిగి అదుపులోకి తీసుకొన్నారు. ఇప్పుడు పరారీలో ఉన్నవారి ఆచూకీ కోసమే వెతుకుతున్నారు.

Next Story