- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral: నువ్వసలు మనిషివేనా.. నేలపై ఈడ్చుకుంటూ వెళ్తూ 70 ఏళ్ల వృద్దునిడి డాక్టర్ దాడి
మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది.

దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రదేశ్ లో (Madhya Pradesh) అమానుష ఘటన జరిగింది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఓ వైద్యుడు సహనం కోల్పోయి ఓ వృద్ధుడిపై దారుణంగా దాడికి తెగబడ్డాడు. ఛతర్ పూర్ (Chhatarpur) జిల్లా ఆసుపత్రిలో గత గురువారం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 77 ఏళ్ల ఉదవ్ లాల్ జోషి అనే వృద్ధుడు కడుపునొప్పితో బాధపడుతున్న తన భార్యను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చాచడు. ఆసుపత్రిలో అప్పటికే చాలా మంది రోగులు ఉండటంతో క్యూలో తన భార్య కు చికిత్స కోసం నిలబడ్డారు. పెద్ద సంఖ్యలో రోగులు ఉండటం చూసి అప్పటికే చిరాకులో ఉన్న డాక్టర్ మీరెందుకు లైన్లో నిల్చున్నారని జోష్ ను ప్రశ్నించాడు. ఈ క్రమంలో తమ సమస్య వివరించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా సహనం కోల్పియిన డాక్టర్ తనపై దాడికి పాల్పడ్డారని ఆ వృద్ధుడు ఆరోపించారు. అంతటితో ఆగకుండా ఆ డాక్టర్ తనను కొట్టుకుంటూ నేలపై నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకుంటూ లోపలికి తీసుకువెళ్లాడని, ఈ దాడిలో నా అద్దాలు పగిలిపోయాయని, నా భార్యపై కూడా దాడి చేశారని తన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వృద్ధుడిని ఈడ్చుకెళ్తుండగా అక్కడ ఉన్నవారు ఆ దాడి ఘటనను తమ సెల్ ఫోన్లలో రికార్డు చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
వృద్ధుడే అసభ్యంగా ప్రవర్తించాడు: డాక్టర్లు
ఈ ఘనటపై హాస్పిటల్ సివిల్ సర్జన్ డాక్టర్ ఎల్జీ అహిర్వర్ మాట్లాడుతూ ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగిందని అంగీకరించినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. అయితే తొలుత వృద్ధుడే అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశాంచామని సదరు డాక్టర్ కు నోటీసులు జారీ చేసామని అహిర్వర్ తెలిపారు. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ వైద్యం చేయమని అడిగితే చెంపదెబ్బలు కొడతారని బీజేపీ అధికారంలో ఉన్న చోట్లలో ప్రజల పరిస్థితి ఇలాగే ఉందని విమర్శించింది. ఈ ఘటనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నువ్వసలు మనిషివేనా అంటూ డాక్టర్ పై ఫైర్ అవుతున్నారు.






