విద్యారంగ సమస్యలపై 24న మహా ధర్నా

by Ajay Maddhiboyina |

యూజీసీ ముసాయిదా నిబంధనల కారనంగా విశ్వ విద్యాలయాలకు వారి అధ్యపకులను వారే ఎంపిక చేసుకోవడానికి మరింత అధికారం వస్తుందని అన్నారు.

విద్యారంగ సమస్యలపై 24న మహా ధర్నా
X

- జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపనున్న విద్యార్థి సంఘాలు

దిశ, నేషనల్ బ్యూరో: పేపర్ లీకేజీలు అరికట్టడం, విశ్వవిద్యాలయాల్లో ఎన్నికల నిర్వహణ, జాతీయ విద్యా విధానం-2020ని ఉపసంహరించడం వంటి కీలకమైన సమస్యలపై విద్యార్థి సంఘాలు ఈ నెల 24న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనున్నాయి. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం, అధ్యాపకులు, సిబ్బంది నియామకాలు, పదోన్నతులపై యూజీసీ ముసాయిదా నిబంధనలను తొలగించడం వంటి డిమాండ్లు కూడా ఇందులో ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న ఏడు విద్యార్థి సంఘాలు కలిసి 'ఇండియా అలయన్స్ స్టూడెంట్ ఆర్గనైజేషన్' పేరుతో ఈ మహాధర్నాను చేపట్టనున్నాయి. ఈ నిరసన ప్రతిపాదనపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. యూజీసీ ముసాయిదా నిబంధనల కారనంగా విశ్వ విద్యాలయాలకు వారి అధ్యపకులను వారే ఎంపిక చేసుకోవడానికి మరింత అధికారం వస్తుందని అన్నారు. రాష్ట్రాల విశ్వవిద్యాలయాలు సమగ్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు. కొత్తగా ఏర్పడిన విద్యార్థి సంఘం గొడుగులో విద్యావేత్తలు, మాజీ యూజీసీ చైర్మన్లు, ఇండియా కూటమి కింది ఉన్న రాజకీ పార్టీల నాయకులు, ఉపాధ్యయ సంఘాలు ఉన్నాయని కేంద్ర మంత్రి ఆరోపించారు.

Next Story