- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bihar: బిహార్ లో కల్తీ మద్యం తాగి ఏడుగురు మృతి..!
బిహార్(Bihar) పశ్చిమ చంపారన్ జిల్లాలో(West Champaran district) కల్తీ మద్యం తాగి ఏడుగురు చనిపోయారు. కాగా.. కల్తీ మద్యం తాగిన ఘటనలో నాలుగు రోజుల క్రితం ఒకరు చనిపోయారు.

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్(Bihar) పశ్చిమ చంపారన్ జిల్లాలో(West Champaran district) కల్తీ మద్యం తాగి ఏడుగురు చనిపోయారు. కాగా.. కల్తీ మద్యం తాగిన ఘటనలో నాలుగు రోజుల క్రితం ఒకరు చనిపోయారు. ప్రస్తుతం, ఆ సంఖ్య ఏడుకు చేరినట్లు అధికారులు తెలిపారు. అయితే, కల్తీ మద్యం సేవించడం వల్లే ఏడుగురు చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. కానీ, పోలీసులు మాత్రం ఆ విషయాన్ని ధ్రువీకరించలేదు. కేవలం ఐదుగురు మాత్రమే కల్తీ లిక్కర్ వల్ల చనిపోయినట్లు పేర్కొన్నారు. మరో ఇద్దరు వేర్వేరు కారణాల వల్ల చనిపోయినట్లు పశ్చిమ చంపారన్ జిల్లా ఎస్పీ శౌర్య సుమన్ వెల్లడించారు. ఒకరిని ట్రాక్టర్ ఢీకొట్టగా, మరొకరు పక్షవాతం బారిన పడి చనిపోయినట్లు తెలిపారు. "మొదటి మరణం జనవరి 15న జరిగింది. అయితే, ఈ ఎపిసోడ్ గురించి మాకు ఆలస్యంగా సమాచారం అందింది. మిగిలిన నాలుగు మరణాలకు కారణం అస్పష్టంగా ఉంది. ఎందుకంటే పోలీసులకు సమాచారం అందేలోగానే ఏడుగురి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం" అని ఎస్పీ వెల్లడించారు. ఈ మరణాలన్నీ లౌరియా పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరిగాయని తెలిపారు. ఇకపోతే, నితీష్ కుమార్ ప్రభుత్వం ఏప్రిల్ 2016లో బిహార్‌లో మద్యం నిషేధం విధించింది. కానీ, దానివల్లే కల్తీ మద్యం విక్రయాలు జోరుగా జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.






