Manipur: బీరెన్ సింగ్ రాజీనామా.. వెంటనే బీజేపీతో జతకట్టేందుకు రెడీ అయిన ఎన్పీపీ

by Shamantha N |

మణిపూర్‌ సీఎంగా(Manipur CM) బీరెన్‌ సింగ్‌(Biren Singh) రాజీనామాతో రాజకీయాలు మారుతున్నాయి. గతంలో బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్న ఎన్పీపీ (National Peoples Party ) బీజేపీతో జత కట్టడానికి రెడీ అయ్యింది.

Manipur: బీరెన్ సింగ్ రాజీనామా.. వెంటనే బీజేపీతో జతకట్టేందుకు రెడీ అయిన ఎన్పీపీ
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌ సీఎంగా(Manipur CM) బీరెన్‌ సింగ్‌(Biren Singh) రాజీనామాతో రాజకీయాలు మారుతున్నాయి. గతంలో బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్న ఎన్పీపీ (National Peoples Party ) బీజేపీతో జత కట్టడానికి రెడీ అయ్యింది. మణిపూర్‌లో గత కొంతకాలంగా కొనసాగుతున్న హింసతో ఎన్పీపీ బీజేపీకి దూరంగా ఉంటుంది. అయితే, బీరెన్ సింగ్ రాజీనామా తర్వాత ఎన్పీపీ కీలక వ్యాఖ్యలు చేసింది. తాము ఎన్డీఏలో భాగమేనని,కేవలం బీరెన్‌ సింగ్‌ నాయకత్వాన్నే వ్యతిరేకించామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్పీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ నూరల్‌ హసన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.మణిపూర్‌లో తిరిగి శాంతి నెలకొనడానికి ‘బీరెన్‌ సింగ్‌ రాజీనామా అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. మేము ఎప్పుడూ ఎన్డీఏలో భాగమే. బీజేపీతో కలిసి పనిచేస్తాం. మళ్లీమణిపూర్‌ను గాడిలో పెడతాం’ అని అన్నారు. మరోవైపు, మణిపూర్ తదుపరి సీఎం ఎవరనే విషయాన్ని హైకమాండ్ నిర్ణయానికి వదిలేస్తామని మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే వై కేమచంద్ర సింగ్ అన్నారు. పార్టీ సభ్యులంతా తప్పకుండా బీజేపీ హైకమాండ్‌ నిర్ణయాన్ని గౌరవిస్తామని తెలిపారు.

మణిపూర్ అల్లర్లు

మణిపూర్‌లో రెండు తెగల మధ్య జరిగిన వైరం కాస్తా పెద్దగా మారి అల్లర్లు చెలరేగాయన్నారు. మైతీ, కుకీ తెగల మధ్య వైరంతో ఉద్రిక్త పరిస్థితులు దారి తీసాయి. 2022లో మణిపూర్‌లో జరిగిన ఎన్నికల్లో సీఎంగా బీరెన్‌ సింగ్‌నే బీజేపీ అధిష్టానం తిరిగి నియమించింది. అయితే 2023 మే నెలలో ఘర్షణలు రాజుకున్నప్పుడు బీరెన్‌ సింగ్‌ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. మణిపూర్ రెండు జాతుల మధ్య అల్లర్లు జరుగుతున్నాయనే విషయాన్ని గుర్తించేందుకే నిరాకరించారు. దీంతో, బీరెన్ సింగ్ పై సర్వత్రా వ్యతిరేకత ఏర్పడింది. ఇకపోతే, మణిపూర్‌ హింస వల్ల ఇప్పటివరకు 260 మంది బలి కాగా, 60 వేల మంది ఇప్పటికీ రక్షణ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

Next Story