- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆప్‌కు ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా
ఈ ఏడుగురు సిట్టింగ్‌లకు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఆప్ టికెట్లు నిరాకరించింది. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లుగా వ్యవహరించిన ఎమ్మెల్యేలు.. మరో వారంలో పోలింగ్ అనగా కీలక నిర్ణయం తీసుకున్నారు.

- కేజ్రివాల్, పార్టీపై నమ్మకం పోయిందని వ్యాఖ్య
- ఈ ఏడుగురికి టికెట్లు నిరాకరించిన ఆప్
- ఒకే సారి రాజీనామాతో కేజ్రివాల్‌కు బిగ్ షాక్
దిశ, నేషనల్ బ్యూరో:
మరో ఐదు రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ పోలింగ్ జరగనుండగా అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం తమ లేఖలను ఆప్ కన్వీనర్ కేజ్రివాల్‌కు పంపించారు. కాగా, ఈ ఏడుగురు సిట్టింగ్‌లకు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఆప్ టికెట్లు నిరాకరించింది. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లుగా వ్యవహరించిన ఎమ్మెల్యేలు.. మరో వారంలో పోలింగ్ అనగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా చేసిన వారలో మెహ్‌రౌలీ ఎమ్మెల్యే నరేశ్ యాదవ్, త్రిలోక్‌పురి ఎమ్మెల్యే రోహిత్ కుమార్, జనక్‌పురి ఎమ్మెల్యే రాజేశ్ రిషి, కస్తూర్భానగర్ ఎమ్మెల్యే మదన్ లాల్, ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే పవన్ శర్మ, పాలం ఎమ్మెల్యే భావనా గౌర్, బిజ్వాసన్ ఎమ్మెల్యే బీఎస్ జూన్ ఉన్నారు. 'తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. పార్టీ మీద, మీ(కేజ్రివాల్) మీద నమ్మకం పోయింది. నా రాజీనామాను ఆమోదించగలరు' అని భావనా గౌర్ తన లేఖలో పేర్కొన్నారు. మదన్ లాల్, బీఎస్ జూన్ కూడా ఇదే విధంగా తమ రాజీనామా లేఖల్లో పేర్కొనడం గమనార్హం.
మెహ్‌రౌలీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నరేశ్ కుమార్.. ఖురాన్‌ను అవమానపరిచారనే కేసులో పంజాబ్ కోర్టు ద్వారా దోషిగా నిర్ధారించబడ్డాడు. ఈ కేసులో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష కూడా పడింది. దీంతో మెహ్‌రౌలీ నుంచి నరేశ్‌ను తప్పించి మహేందర్ చౌదరిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే నరేశ్ యాదవ్ తన రాజీనామాలో మాత్రం ఆప్ తన వ్యవస్థాపక సూత్రమైన నిజాయితీ కలిగిన రాజకీయాలు అనే లైన్‌ను మర్చిపోయిదని, అవినీతిని తగ్గిస్తామని చెప్పిన పార్టీ ఇప్పుడు అవినీతి ఆరోపణల్లో కూరుకొని పోయిందని పేర్కొన్నాడు.
త్రిలోక్‌పురి ఎమ్మెల్యే రోహిత్ కుమార్ 'ఎక్స్'వేదికగా ఆప్‌పై విమర్శలు చేశారు. దళితులు, వాల్మీకీ సామాజిక వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పిన ఆమ్ ఆద్మీ పార్టీ తన హామీని విస్మరించిందని చెప్పారు. ఆ సామాజిక వర్గాల ఉద్దరణను పక్కన పెట్టడమే కాకుండా.. కాంట్రాక్ లేబర్‌ను తొలగించిందని, తాత్కాలిక కార్మికులను శాశ్వతంగా పక్కన పెట్టిందని ఆరోపించారు.






