- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bribes Payment : ఔను.. లంచాలు ఇస్తున్నాం.. సర్వేలో చెప్పిన 66 శాతం మంది వ్యాపారులు
దిశ, నేషనల్ బ్యూరో : మన దేశంలో కరప్షన్ ఏ రేంజులో ఉందో తెలుసుకునేందుకు ‘లోకల్ సర్కిల్స్’(LocalCircles Survey) సంస్థ నిర్వహించిన ‘ఇండియా బిజినెస్ కరప్షన్ సర్వే 2024’లో పలు కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.

దిశ, నేషనల్ బ్యూరో : మన దేశంలో కరప్షన్ ఏ రేంజులో ఉందో తెలుసుకునేందుకు ‘లోకల్ సర్కిల్స్’(LocalCircles Survey) సంస్థ నిర్వహించిన ‘ఇండియా బిజినెస్ కరప్షన్ సర్వే 2024’లో పలు కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని వ్యాపారుల్లో 66 శాతం మంది నేటికీ ఏదో ఒక సందర్భంలో లంచం ఇచ్చి ప్రభుత్వ పనులు చేయించుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. అయితే వ్యాపారులు(Businesses) ఈవిధంగా ముడుపులను ముట్టజెప్పే(Bribes Payment) ట్రెండ్ గత 12 నెలల్లో గణనీయంగా తగ్గిందని గుర్తించారు. సర్వేలో భాగంగా దేశంలోని 159 జిల్లాల్లో 9వేలకుపైగా విభిన్న వ్యాపారాలు చేస్తున్న 18వేల మందికిపైగా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు.
ఎన్నిసార్లు ఇచ్చారు ?
గత 12 నెలల్లో ఎన్నిసార్లు ప్రభుత్వ సిబ్బంది, అధికారులకు లంచాలు ఇచ్చారని 2,339 మంది వ్యాపారులను ప్రశ్నించగా.. 41 శాతం మంది చాలాసార్లే ఇచ్చామని బదులిచ్చారు. ఒకటి లేదా రెండుసార్లే లంచం ఇచ్చామని 24 శాతం మంది చెప్పారు. సగటున 66 శాతం మంది వ్యాపారులు తాము గత 12 నెలల్లో ముడుపులిచ్చి వివిధ ప్రభుత్వ పనులు చేయించుకున్నట్లు ఒప్పుకున్నారు.
ఏ పద్ధతిలో ఇచ్చారు ?
‘‘లంచాలను ఏ పద్ధతిలో చెల్లించారు’’ అని 2,127 మంది వ్యాపారులను ప్రశ్నించగా.. 53 శాతం మంది తాము నగదురూపంలో ఇచ్చామని తెలిపారు. 30 శాతం మంది ఏజెంట్ల ద్వారా ప్రభుత్వ సిబ్బందికి లంచం పంపామన్నారు. 17 శాతం మంది గిఫ్టుల రూపంలో లంచాన్ని అందించామని చెప్పారు. మొత్తం మీద 83 శాతం మంది నగదు రూపంలోనే లంచాలు ఇచ్చారు.
ఎందుకు ఇచ్చారు ?
‘‘ప్రభుత్వ సిబ్బందికి లంచం ఎందుకు ఇచ్చారు’’ అని 2,183 మందిని ప్రశ్నించగా.. పని చేయించుకునే మార్గం అదొక్కటే అని 54 శాతం మంది బదులిచ్చారు. లంచం ఇవ్వకుంటే తమ పని ఇంకా ఆలస్యమై ఉండేదని 46 శాతం మంది తెలిపారు. తమను బలవంతం చేసినందు వల్లే లంచం ఇచ్చామని సర్వేలో పాల్గొన్న 54 శాతం మంది వ్యాపారులు చెప్పారు. సమయానికి పనులు కావాలనే ఉద్దేశంతోనే లంచం ఇచ్చుకున్నామని 46 శాతం మంది పేర్కొన్నారు.
ఏయే విభాగాలకు ఇచ్చారు?
‘‘గత 12 నెలల్లో ఎక్కువసార్లు లంచం ఇచ్చిన ప్రభుత్వ విభాగాలు ఏవి ?’’ అని 9,027 మందిని ప్రశ్నించగా.. లీగల్ మెట్రాలజీ, ఫుడ్, డ్రగ్, హెల్త్ విభాగాలకు ముడుపులు ఇచ్చామని 75 శాతం మంది చెప్పారు. లేబర్, పీఎఫ్ విభాగాల అధికారులకు లంచాలు ఇచ్చామని 69 శాతం మంది తెలిపారు. ప్రాపర్టీ అండ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్, ప్రాపర్టీ ట్రాన్స్‌ఫర్ అధికారులకు లంచాలు ఇచ్చామని 68 శాతం మంది పేర్కొన్నారు. జీఎస్టీ అధికారులకు లంచం ఇచ్చామని 62 శాతం మంది, పొల్యూషన్ విభాగం సిబ్బందికి ఇచ్చామని 59శాతం మంది, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఇచ్చామని 57 శాతం మంది తెలిపారు.






