మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ.. 40 రోజుల్లోనే 61 మంది మృతి

by Gantepaka Srikanth |   ( Updated:2025-02-09 12:54:38.0  )
మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ.. 40 రోజుల్లోనే 61 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు పార్టీ(Maoist Party)కి వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతోంది. గత 40 రోజుల్లోనే ఏకంగా 61 మంది వరకు మావోయిస్టులు మృతిచెందారు. ఈ విషయాన్ని స్వయంగా పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారించారు. ముఖ్యంగా 2025 ప్రారంభం నుంచి పోలీసులు వరుసగా కూంబింగ్‌(Security Forces)లు నిర్వహిస్తున్నారు. జనవరి 5వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌(Encounter)లో నలుగురు మావోయిస్టులు, అదే నెల 12న జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు, ఇక జనవరి 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12మంది మావోయిస్టులు, జనవరి 21న జరిగిన ఎదురుకాల్పుల్లో 16 మంది, జనవరి 29న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు, ఫిబ్రవరి 2న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12మంది మావోయిస్టులు మృతిచెందగా.. తాజాగా ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో 31 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ ఎన్‌కౌంటర్‌తో కలిపి, ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన ఎన్‌కౌంటర్లలో మొత్తం 61 మంది మావోయిస్టులు మృతిచెందారని గణాంకాలు చెబుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఏడు జిల్లాలని కలుపుతూ చుట్టూ సెలయేర్లు, పెద్ద పెద్ద గుట్టలు, దట్టమైన అడవులు ఉన్నాయి. సుక్మా, దంతేవాడ, నారాయణపూర్, కాంకేర్, బస్తర్ జిల్లాల ప్రాంతాల్లో అబుజ్ మడ్ కొంత భాగం ఉంటే.. మరి కొంత భాగం దండకారణ్యంలో ఉంది. ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల్లోని దండకారణ్యంలో ఉన్న మావోయిస్టులకు ఈ అటవీ ప్రాంతాలు కీలక స్థావరాలు. దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టు నాయకత్వం అంతా కూడా ఇక్కడే ఉంటుంది.. అందుకే ఈ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న పోలీసులు ఏరివేత మొదలెట్టారు.

Next Story

Most Viewed