Mumbai: ముంబైలోబస్సు బీభత్సం.. ఆరుగురు మృతి

by Shamantha N |
Mumbai: ముంబైలోబస్సు బీభత్సం.. ఆరుగురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర రాజధాని ముంబైలో (Mumbai) ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. కుర్లాలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. మరో 49 మందికి గాయాలయ్యాయి. ముంబైలోని కుర్లాలో మున్సిపల్ కార్పొరేషన్‌కు (BMC) చెందిన బెస్ట్‌ (BEST) బస్సు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు స్పాట్ లోనే చనిపోగా.. మరో ముగ్గురు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన 49 మందిని సియోన్, కుర్లా బాబా హాస్పిటల్ లో చేర్చారు. సోమవారం రాత్రి కుర్లా నుంచి అంధేరికి వెళ్తున్న బెస్ట్‌ బస్సు బుద్ధ కాలనీ వద్ద అది పాదచారులు, కొన్ని వాహనాలపైకి దూసుకెళ్లింది. అంతేకాకుండా, బస్సు 200 మీటర్ల వరకు బీభత్సం సృష్టిస్తూ దూసుకెళ్లడంతో స్థానిక రెసిడెన్షియల్ గేట్లు బద్దలయ్యాయి.

సహాయక చర్యలు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగ్రాతులను దవాఖానకు తరలించారు. డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టామని.. బ్రేక్ ఫెయిల్ కావడంతోనే బస్సుపై అతడు నియంత్రణ కోల్పోయాడని చెప్పారు. కాగా, బస్సును అతివేగంతో నడిపినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన బస్సు కొత్తదేనని, మూడు నెలల క్రితమే రిజిస్ట్రేషన్‌ అయిందని ప్రాంతీయ రవాణా అధికారి (RTO) పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed