Karnataka : కెనరా బ్యాంకులో59 కిలోల బంగారం చోరీ

by Muthe.Rajitha |

కర్ణాటక(Karnataka)లో ఓ కెనెరా బ్యాంకు(Canara Bank) బ్రాంచిలో భారీ బంగారం దొంగతనం(Gold Robbery) జరిగింది.

Karnataka : కెనరా బ్యాంకులో59 కిలోల బంగారం చోరీ
X

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక(Karnataka)లో ఓ కెనెరా బ్యాంకు(Canara Bank) బ్రాంచిలో భారీ బంగారం దొంగతనం(Gold Robbery) జరిగింది. విజయపుర(Vijayapura) జిల్లాలో మంగోలి వద్ద గల కెనరా బ్యాంక్ బ్రాంచిలో 59 కిలోల బంగారం చోరీ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పేర్కొన్నారు. చోరీని తప్పు దారి పట్టించేందుకు నిందితులు బ్యాంకు వద్ద చేతబడి వంటి కార్యకలాపాలకు పాల్పడ్డట్టు అధికారులు తెలియజేశారు. ఈ ఘటనలో బ్యాంక్ సిబ్బంది పాత్ర ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. చోరీ కాబడిన బంగారం ఖాతాదారులు తాకట్టు పెట్టిన ఆభరణాలేనని, వాటి విలువ కోట్ల రూపాయల్లో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఘటన విజయపురలో సంచలనం సృష్టించింది.

Next Story