- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tiger Reserve: మధ్యప్రదేశ్‌లో 58వ టైగర్ రిజర్వ్ ఏర్పాటును ప్రశంసించిన ప్రధాని మోడీ
కొత్త టైగర్ రిజర్వ్ ద్వారా భారత్ ఎల్లప్పుడూ జంతువులను రక్షించడంతో ముందుంటుందని అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి భారత ప్రభుత్వం 58వ, మధ్యప్రదేశ్‌లో తొమ్మిదో టైగర్ రిజర్వ్‌ను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రశంసించారు. వన్యప్రాణుల ప్రేమికులకు శుభవార్త. భారత్‌కు వైవిధ్యమైన వణ్యప్రాణులు, జంతువులను కాపాడుకునే అవకాశం లభించింది. కొత్త టైగర్ రిజర్వ్ ద్వారా భారత్ ఎల్లప్పుడూ జంతువులను రక్షించడంతో ముందుంటుందని అన్నారు. భారత్ పులుల అభయారణ్యాల సంఖ్యను 58కి పెంచడం సంతోషంగా ఉంది. కొత్తగా మధ్యప్రదేశ్‌లోని మాధవ్ టైగర్ రిజర్వ్ ఆ జాబితాలో చేరిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వన్యప్రాణుల ప్రేమికులు, సంరక్షకులందరినీ నేను అభినందిస్తున్నాను. ఈ టైగర్ రిజర్వ్ నిస్వార్థంగా కృషి చేస్తున్న మన అటవీ అధికారుల నిర్విరామ కృషికి నిదర్శనం అని భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు.






