- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maoists Surrender: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. మరో 52 మంది సరెండర్
వరుస లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్లతో కకావికలమవుతున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.

దిశ, డైనమిక్ బ్యూరో: వరుస లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్లతో కకావికలమవుతున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా 52 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా (Chhattisgarh Bijapur) ఎస్పీ డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ (SP Jitendra Kumar Yadav), సీఆర్పీఎఫ్ అధికారుల ఎదుట గురువారం సరెండర్ (Maoists Surrender) అయ్యారు. లొంగిపోయిన వారిలో 21 మంది మహిళలు, 31 మంది పురుషులు ఉండగా వీరిలో 49 మంది మావోయిస్టులపై 1.41 కోట్ల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. సరెండర్ అయిన వారిలో దండకారణ్య స్పెషల్ జోన్, ఏవోబీ, భామ్రాఘర్ ఏరియా కమిటీ (మహారాష్ట్ర)కు చెందిన మావోయిస్టులు ఉన్నారని పోలీసులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పునరావస కార్యక్రమంలో భాగంగా వీరంతా లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. మావోయిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలను వీడి జనజీవన స్రవంతి లోకి రావాలని ఎస్పీ పిలుపునిచ్చారు.






