రెచ్చిపోయిన తిరుగుబాటు దారులు.. 52 మంది ఊచకోత

by Naga Rani Yarlagadda |

కాంగోలో (Congo) తిరుగుబాటు దారులు రెచ్చిపోయారు. ఇస్లామిక్ స్టేట్ మద్దతుతో.. కత్తులు, గొడ్డళ్లతో 52 మందిని ఊచకోత కోసి.. దారుణంగా హతమార్చారు.

రెచ్చిపోయిన తిరుగుబాటు దారులు.. 52 మంది ఊచకోత
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగోలో (Congo) తిరుగుబాటు దారులు రెచ్చిపోయారు. ఇస్లామిక్ స్టేట్ మద్దతుతో.. కత్తులు, గొడ్డళ్లతో 52 మందిని ఊచకోత కోసి.. దారుణంగా హతమార్చారు. స్థానిక అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. అలైట్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ADF) సభ్యులు ఈ దారుణానికి పాల్పడినట్లు అక్కడి అధికారులు తెలిపారు. కాంగో బెని, లుబెరో ప్రాంతాల్లో ఉన్న పౌరులను నిద్రలేపి.. చేతుల్ని కట్టిపడేసి కత్తులు, గొడ్డళ్లతో అతికిరాతకంగా నరికి చంపారని తెలిపారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.

దాడులకు పాల్పడిన తిరుగుబాటు సంస్థ ఏడీఎఫ్ కు ఇస్లామిక్ స్టేట్ (Islamic State)తో సంబంధాలున్నాయి. ఉగాండా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలను సాగిస్తూ.. సాధారణ పౌరులే లక్ష్యంగా దాడులు చేస్తోంది. గడిచిన 12 ఏళ్లలో సుమారు 6 వేల మందికి పైగా బలితీసుకున్నట్లు నివేదికలు చెప్తున్నాయి.

Next Story