ఛత్తీస్‌గఢ్‌లో 51 మంది మావోయిస్టుల లొంగుబాటు

by Muthe.Rajitha |   (  Updated:2025-10-29 12:10:34  IST  )

వరుస లొంగుబాట్లతో సతమతం అవుతున్న మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది.

ఛత్తీస్‌గఢ్‌లో 51 మంది మావోయిస్టుల లొంగుబాటు
X

దిశ, వెబ్ డెస్క్ : వరుస లొంగుబాట్లతో సతమతం అవుతున్న మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. బుధవారం ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 51 మంది మావోయిస్టులు లొంగిపోగా.. వారిలో 9 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే వీరి వివరాలతోపాటు, మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ నేపథ్యంలో భారీగా మావోయిస్టులు లొంగిపోతున్న సంగతి తెలిసిందే. అయితే మావోయిస్టు రహిత భారత్ గా మార్చేంత వరకు ఈ ఆపరేషన్ కొనసాగిస్తామని అమిత్ షా ప్రకటించిన క్రమంలో.. వందల సంఖ్యలో మావోయిస్టులు హతం కావడం, వేల సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాటులు జరుగుతున్నాయి.

Next Story