వణుకుతున్న పాకిస్థాన్..5వేల మంది సైనికుల రాజీనామా!

by Ajay Maddhiboyina |

పహల్గామ్ ఘటన నేపథ్యంలో పాక్ పై భారత్ సీరియస్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తుండటంతో ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్దమైంది.

వణుకుతున్న పాకిస్థాన్..5వేల మంది సైనికుల రాజీనామా!
X

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఘటన నేపథ్యంలో పాక్ పై భారత్ సీరియస్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తుండటంతో ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్దమైంది. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో పాక్ జోక్యం చేసుకుంటే ఆ దేశంతో యుద్ధం తప్పేలా లేదు. సరిహద్దులు వార్ జోన్లుగా మారుతుండటంతో పాకిస్థాన్ ఆర్మీ వణికిపోతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 5వేల మంది పాకిస్థాన్ సైనికులు రాజీనామా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

దీంతో పాక్ 40వేల మంది రిటైర్మెంట్ తీసుకున్న సైనికులకు పాకిస్థాన్ పిలుపునిచ్చింది. పహల్గామ్ ఘటన వెనుక పాకిస్థాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిఫ్ మునీర్ హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. పదవీకాలం ముగియనుండటంతో, అదే పదవిలో కొనసాగాలనే ఆలోచనతో ఆయన ఉగ్రదాడులకు కుట్ర చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు భారత ఆర్మీ ప్రపంచంలోనే శక్తివంతమైన ఆర్మీలలో 5వ స్థానంలో ఉండగా పాక్ స్థానం పత్తాలేకుండా పోయింది. ఆ దేశం ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతోంది. కాబట్టి ఆ దేశపౌరులు సైతం ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.

Next Story