- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరువులో 500 ఓటర్ కార్డులు ప్రత్యక్షం.. విచారణకు ఆదేశించిన సర్కార్
దేశ వ్యాప్తంగా ‘ఓట్ చోరీ’ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ‘ఓట్ చోరీ’ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఛత్తార్‌పూర్ జిల్లా బిజావర్ (Bijawar) పట్టణంలోని రాజా చెరువులో 500ల పైచిలుకు ఒరిజినల్ ఓటరు కార్డులు నీళ్లపై తేలియాడుతుండటం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. పారిశుధ్య కార్మికులు చెరువు ప్రాంగణంలో పారిశుధ్య పనులు చేపడుతుండగా.. చెరువులో ఓటరు కార్డులు తేలియాడుతుండటం చూశారు. అదేవిధంగా పక్కనే ఓ బ్యాగులో మరో 400 నుంచి 500 కార్డులు కూడా ఉండటం గమనించారు. అవన్ని వార్డు నెం.15కు చెందినవిగా వారు గుర్తించి అధికారులకు సమాచారం అందజేశారు. స్పాట్ చేరుకున్న వారు ఆ కార్డులన్ని ఒరిజనల్ అని.. కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పంపిణీ చేసేవని నిర్ధారించారు. అయితే, చెరువు వద్దకు ఓటరు కార్డులు ఎలా వచ్చాయి..? తీసుకొచ్చింది ఎవరూ..? అనే విషయాలపై సమగ్రంగా విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు చేసింది.






