- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chhattisgarh: మోడీ చత్తీస్ గఢ్ పర్యటన.. లొంగిపోయిన 50 మంది మావోయిస్టులు
ప్రధాని మోడీ పర్యటన ముందు ఛత్తీస్‌గఢ్‌లో కీలకపరిణామం జరిగింది. 50 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ పర్యటన ముందు ఛత్తీస్‌గఢ్‌లో కీలకపరిణామం జరిగింది. 50 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. బీజాపూర్ ఎస్పీ ఎదుట మావోలు లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు. లొంగిపోయిన వారిలో 10 మంది మహిళలు ఉన్నారు. వారిలో 14 మందిపై రూ.68లక్షల రివార్డ్ ఉంది. మావోయిస్టు సిద్ధాంతాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకువడం, వారి సీనియర్ కేడర్ స్థానిక గిరిజనుల్ని దోచుకోవడం, అంతర్గత విభేదాల కారణంగా లొంగిపోయినట్లు బీజాపూర్ సీనియర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా వారికి పునరావసం కల్పిస్తామని చెప్పారు. అయితే, మార్చి 31, 2026లోపు నక్సలిజాన్ని నిర్మూలించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
ఎన్ కౌంటర్ లో 18 మంది హతం
శనివారం శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో భద్రతా దళాలు రెండు ప్రాంతాల్లో జరిపిన ఎదురుకాల్పుల్లో 18 మావోయిస్టులను మట్టుబెట్టాయి. వీరిలో 11 మంది మహిళలు ఉన్నారు. ఆ భారీ ఎన్‌కౌంటర్ జరిగిన కొన్ని గంటల వ్యవధిలో మావోయిస్టులు లొంగిపోయారు. కాగా,ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 134 మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. వీరిలో 118 మంది బస్తర్ డివిజన్‌లోనే మృతి చెందారు. 2024లో మొత్తం 792 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఛత్తీస్ గఢ్ లో పర్యటించనున్నారు. రూ.33,700 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు.






