- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహారాష్ట్రలో 5వేల మంది పాకిస్థానీలు..ఇక్కడే పెళ్లిళ్లు చేసుకుని!
పాకిస్థాన్ పౌరులు వారి దేశానికి తిరిగి వెళ్లిపోవాలని ప్రధాని మోడీ స్పష్టం చేసిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో వారిని గుర్తించి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ పౌరులు వారి దేశానికి తిరిగి వెళ్లిపోవాలని ప్రధాని మోడీ స్పష్టం చేసిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో వారిని గుర్తించి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మహరాష్ట్రలో ఏకంగా 5వేల మంది పాకిస్థాన్ పౌరులు ఉన్నారని ఆ రాష్ట్ర మంత్రి యోగేష్ కదమ్ తెలిపారు. అందులో 4వేల మందికి లాంగ్ టర్మ్ వీసాలు ఉండగా వెయ్యి మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నాయన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు షార్ట్ టర్మ్ వీసా హోల్డర్స్ వెంటనే కాళీ చేయాలని చెప్పారు.
కొంతమంది 8-10 సంవత్సరాల నుండి మహారాష్ట్రలోనే ఉంటున్నారని చెప్పారు. కొందరు ఇక్కడే పెళ్లిళ్లు కూడా చేసుకుని ఇండియన్ పౌరసత్వానికి అప్లై చేసుకున్నారని తెలిపారు. మెడికల్ వీసాలు కలిగినవాళ్లు ఈ నెల 29వరకు వెళ్లిపోవాలని చెప్పారు. ఇదిలా ఉంటే పహల్గామ్ లో టెర్రరిస్టులు 26మంది భారతీయులను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాకిస్థానీయులను తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పాకిస్థాన్ సైతం వారి దేశం నుండి భారతీయులు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.






