- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Road Accident: ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. ఐదుగురు డాక్టర్లు మృతి
ఉత్తరప్రదేశ్‌లో(UP) ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. కన్నౌజ్‌లో మంగళవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులు చనిపోయారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో(UP) ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. కన్నౌజ్‌లో మంగళవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులు చనిపోయారు. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై(Agra-Lucknow expressway) కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో, ఆ కారుని అటువైపు నుంచి వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా సైఫాయి మెడికల్ కాలేజీలో పీజీ చదువుకుంటున్న వైద్య విద్యార్థులు. చనిపోయిన వారిని అనిరుధ్ వర్మ, సంతోష్ కుమార్ మౌర్య, అరుణ్ కుమార్, నార్దేవ్ గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మొరాదాబాద్‌లోని బుద్ధ విహార్‌కు చెందిన కరణ్ సింగ్ కుమారుడు జైవీర్ సింగ్ ఈ ప్రమాదంలో గాయపడ్డారు. మృతదేహాలను ప్రస్తుతం మార్చురీలో భద్రపరిచారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.






