- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో 487 మంది భారతీయులపై బహిష్కరణ వేటు!
యూఎస్ మిలటరీ విమానం సీ-17లో 104 మంది భారతీయులను సంకెళ్లలో బంధించి ఇండియాకు వెనక్కి పంపిన తీరుపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ కీలక ప్రకటన చేసింది.

- తుది తొలగింపు ఉత్తర్వుల్లో చేర్చిన అమెరికా
- విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన ఎంత మంది భారతీయులపై బహిష్కరణ వేటు పడనుందో విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. మరో 487 మంది భారతీయులను తుది తొలగింపు ఉత్తర్వుల్లో చేర్చినట్లు యూఎస్ అధికారులు తమకు సమాచారం అందించారని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి చెప్పారు. యూఎస్ మిలటరీ విమానం సీ-17లో 104 మంది భారతీయులను సంకెళ్లలో బంధించి ఇండియాకు వెనక్కి పంపిన తీరుపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ కీలక ప్రకటన చేసింది. అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వారి సంఖ్య ఎంత ఉందనే విషయాలను తెలుసుకోవడానికి అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని మిస్రీ తెలిపారు. అమెరికాలోకి అక్రమ మార్గాలు, పద్దతుల ద్వారా ప్రవేశించిన వారిని ట్రంప్ ప్రభుత్వం సంకెళ్లలో బంధించి అమృత్‌సర్‌కు తీసుకొచ్చి వదిలేశారు. అయితే ఈ డీపోర్టేషన్ ప్రక్రియ మునుపటి కంటే చాలా భిన్నంగా ఉందని మిస్రీ అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రభుత్వం దీన్ని జాతీయ భద్రతా చర్యగా పరిగణిస్తుండటం వల్లే సంకెళ్లు వేశారని చెప్పారు.
కాగా, అమెరికా ప్రభుత్వం భారత పౌరులన డీపోర్టేషన్ చేసిన విధానంపై రాజకీయ రగడ చెలరేగింది. కేంద్ర ఎందుకు ఈ విషయంలో కలుగజేసుకొని వారిని వెనక్కి తీసుకొని రాలేదని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. అయితే కేంద్రం మాత్రం తాము గతంలో చాలా దేశాల నుంచి ప్రత్యేక విమానాలు పెట్టి భారత పౌరులను వెనక్కి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. రాజ్యసభలో కూడా ప్రభుత్వ వైఖరిని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ సమర్థించారు. ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో మిగిలిన వారిని ఏ విధంగా తీసుకొని వస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది.






