Uttarakhand : ఉత్తరాఖండ్ లో విరిగిపడ్డ కొండచరియలు.. శిథిలాల కింద 47 మంది కార్మికులు

by Shamantha N |

ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లో ఘోర విపత్తు సంభవించింది. గత కొన్ని రోజులుగా ఇక్కడ భారీగా మంచు కురుస్తుండటంతో శుక్రవారం ఉదయం మంచు చరియలు (Avalanche) విరిగిపడ్డాయి.

Uttarakhand : ఉత్తరాఖండ్ లో విరిగిపడ్డ కొండచరియలు.. శిథిలాల కింద 47 మంది కార్మికులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లో ఘోర విపత్తు సంభవించింది. గత కొన్ని రోజులుగా ఇక్కడ భారీగా మంచు కురుస్తుండటంతో శుక్రవారం ఉదయం మంచు చరియలు (Avalanche) విరిగిపడ్డాయి. వాటికింద 47 మంది కార్మికులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. బద్రీనాథ్‌ (Badrinath) ధామ్‌ కు 3 కిలోమీటర్ల సమీపంలో ఈ విపత్తు సంభవించింది. ఎస్డీఆర్ఎఫ్ (SDRF), ఎన్డీఆర్ఎఫ్ (NDRF), జిల్లా యంత్రాంగం, ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసులు (ITBP), బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (BRO) బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నాయి. రోడ్డు నిర్మాణం కోసం కార్మికులు పనిచేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే, భారత వాతావరణ శాఖ (IMD) ఉత్తరాఖండ్‌ కు ఆరెండ్ అలెర్ట్ జారీ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 20 సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. లోతట్టు ప్రజల ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. పలు చోట్ల అండర్ పాస్ లను మూసివేసే అవకాశం ఉందని వెల్లడించింది.

Next Story