- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Atishi: ఒక్కరోజే 455 మంది దాతల రూ.19.32 లక్షల విరాళం
ఎన్నికల్లో ఖర్చుల కోసం ఢిల్లీ(Delhi) సీఎం అతిషీ(Atishi) ఆదివారం క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించారు. ఒక్కరోజులోనే రూ.19.32 లక్షల ఆన్ లైన్ విరాళాలు అందాయి.

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల్లో ఖర్చుల కోసం ఢిల్లీ(Delhi) సీఎం అతిషీ(Atishi) ఆదివారం క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించారు. ఒక్కరోజులోనే రూ.19.32 లక్షల ఆన్ లైన్ విరాళాలు అందాయి. కాల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆతిషీ (Atishi) ఎన్నికల్లో (Assembly Elections) పోటీ చేసేందుకు తనకు రూ.40లక్షలు కావాలని చెప్పుకొచ్చారు. అంత డబ్బు తన వద్ద లేనందున విరాళాలు ఇవ్వాలని ఆమె ప్రజలను కోరారు. ఇందుకోసం ఓ ఆన్‌లైన్ లింక్‌ను విడుదల చేశారు. అందులో ఇప్పటివరకు 455 మంది దాతలు రూ.19.32లక్షలు విరాళంగా అందించారు. "మొదటి రోజు నా క్రౌడ్ ఫండింగ్ ప్రచారానికి అద్భుతమైన స్పందన చూసి నిజంగా ఉప్పొంగిపోయాను. ఈ భారీ విజయం ఆమ్ ఆద్మీ పార్టీ స్వచ్ఛమైన, నిజాయితీగల, పరివర్తన కలిగించే రాజకీయాలపై ప్రజల అచంచల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ విషయాన్ని వ్యాప్తి చేయండి!" అని అతిషీ ఎక్స్ లో రాశారు. ఇకపోతే, కాల్కాజీ స్థానం నుంచి బీజేపీ తరఫున మాజీ ఎంపీ రమేశ్ బిధూరీ, కాంగ్రెస్ నుంచి అల్కా లంబా పోటీ చేస్తున్నారు. అయితే, 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి పక్షాలైన కాంగ్రెస్, ఆప్ విడివిడిగానే పోటీ చేస్తున్నాయి.






