- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొనసాగుతున్న మావోయిస్టుల లొంగుబాటు పర్వం.. మరో 41 మంది సరెండర్
ఇటీవల జరుగుతున్న తీవ్ర పరిణామాల నేపథ్యంలో భారీగా మావోయిస్టులు లొంగిపోతున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల జరుగుతున్న తీవ్ర పరిణామాల నేపథ్యంలో భారీగా మావోయిస్టులు లొంగిపోతున్న సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం మరో 41 మంది మావోయిస్టులు భద్రతా బలగాల ముందు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో PLGA బెటాలియన్ నెం.1, కంపెనీ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు, మిలీషియా ప్లాటూన్ కమాండర్లు, డెప్యూటీ కమాండర్, జనతానా సర్కార్ సభ్యులు ఉన్నారు.
సరెండర్ అయిన మావోయిస్టు నేతల్లో పాండ్రు హప్కా (మోహన్), బండి హప్కా, లక్ఖు కోర్సా, బాద్రు పునేమ్, సుఖ్రామ్ హెమ్లా, మంజుల హెమ్లా, మంగలి మాడ్వి (శాంతి), జైరామ్ కడియామ్, పాండో మాడ్కామ్ (చంద్ని) వంటి ప్రముఖ మావోయిస్టులు ఉండటం గమనార్హం. వీరిపై ప్రతి ఒక్కరిపై రూ.8 లక్షల చొప్పున రివార్డు ఉండగా, మొత్తం 32 మందిపై రూ.1.19 కోట్ల రివార్డు ఉన్నట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.
ఈ 41 మందిలో 39 మంది సౌత్ సబ్-జోనల్ బ్యూరోకు చెందినవారు కాగా.., దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణా స్టేట్ కమిటీ, ధమతరి-గరియాబంద్-నారాయణపూర్ డివిజన్‌లకు సంబంధించినవారని పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది బీజాపూర్ జిల్లాలో ఇప్పటివరకు 790 మంది మావోయిస్టులు లొంగిపోయగా, గత 23 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,200 మందికి పైగా మావోయిస్టులు ఆయుధాలు వదిలి, జనజీవన స్రవంతిలో కలిసారని అధికారులు వివరించారు. మిగిలిన కేడర్ కూడా త్వరలోనే లొంగిపోతుందని ఎస్పీ జితేంద్ర యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.






