- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
40,547 గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు : పార్లమెంటులో కేంద్రం ప్రకటన
మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్ళు జరుగుతున్నా ఇంకా వేలాది గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు.

దిశ, వెబ్ డెస్క్ : మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్ళు జరుగుతున్నా ఇంకా వేలాది గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. ఈ మాట అంటున్నది ప్రతిపక్షాలో, ఏవైనా ఎన్జీవోస్ లాంటి సంస్థలు చెబుతున్నది కాదు.. స్వయంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది. నేడు జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సమాధానం ఇచ్చారు. దేశంలో ఇంకా 40,547 గ్రామాలకు రోడ్ల లింకేజ్ లేదని తెలిపారు.
ఈ జాబితాలో మధ్యప్రదేశ్ లో 9246 గ్రామాలకు, గుజరాత్ లో 2443 గ్రామాలకు, ఛత్తిస్ గడ్ లో 2692, జమ్ము కశ్మీర్ లో 2262, ఝార్ఖండ్ లో 2787, కేరళ 2335, పశ్చిమ బెంగాల్ లో 2748 గ్రామాలున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో 413, తెలంగాణాలో 173 గ్రామాలకు ఇప్పటికీ రోడ్డు రవాణా సదుపాయం లేదు. అయితే ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన(PMGSY) పథకం కింద 2029 నాటికి ఈ గ్రామాలన్నిటికీ రోడ్డు కనెక్టివిటీ చేపడతామని కేంద్రమంత్రి తెలియజేసారు.






