- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా
23 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులకు ది ఆఫీస్ ఆప్ పర్సనల్ మేనేజ్‌మెంట్ (ఓపీఎం) 'బై అవుట్' ఆఫర్ ప్రకటించింది.

- ముగిసిన 'బై అవుట్' డీల్
- పూర్తిగా ఫలించని ట్రంప్ వ్యూహం
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల తగ్గింపు విషయంలో అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహానికి అనుకున్నంత స్పందన రాలేదు. ఆ దేశంలో 23 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులకు ది ఆఫీస్ ఆప్ పర్సనల్ మేనేజ్‌మెంట్ (ఓపీఎం) 'బై అవుట్' ఆఫర్ ప్రకటించింది. స్వచ్ఛంధంగా ఉద్యోగాలకు రాజీనామా చేస్తే ఎనిమిది నెలల జీతం ముందుగానే ఇస్తామని ట్రంప్ ప్రభుత్వం చెప్పింది.ఈ ఆఫర్‌కు లక్షకు పైగా ఉద్యోగులు స్పందిస్తారని భావించినా.. గురువారం నాటికి కేవలం 40 వేల మంది మాత్రమే రాజీనామా చేశారు. ఈ మేరకు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించగా.. దాన్ని ఓపీఎం ధృవీకరించింది. ట్రంప్ ప్రభుత్వం ఊహించిన దాని కంటే సంఖ్య తక్కువగా ఉన్నా.. భవిష్యత్‌లో మరింత మంది ఈ ఆఫర్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు ఓపీఎం తెలిపింది. ఇప్పటికే 20 లక్షల మంది ఉద్యోగులకు ఈ ఆఫర్ ఉపయోగించుకోవాలని మెయిల్ పంపారు. ఫిబ్రవరి 6లోగా ఒక నిర్ణయానికి రావాలని, ఈ ఆఫర్ ఎంచుకునన వారికి సెప్టెంబర్ వరకు పని చేకుండానే జీతాలు ఇస్తామని తెలిపారు. అయితే జీతం ఇస్తామని చెబుతున్నా.. దానిపై స్పష్టమైన హామీ లేకపోవడంతో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కాగా, ఈ పథకం విజయవంతమైతే ఏటా 100 బిలియన్ డాలర్ల మేరకు ప్రభుత్వంపై భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ బై అవుట్ ఆఫర్ వెనుక ఎలాన్ మస్క్ ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం మస్క్.. ట్రంప్ సర్కార్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డోజే)కి అధిపతిగా ఉన్నారు.






