IndiGo Flights: ఇండిగో విమానాలు రద్దు.. ఎయిర్ పోర్టులోనే చిక్కుకుపోయిన 400 మంది ప్రయాణికులు

by Shamantha N |

ఇస్తాంబుల్ విమానాశ్రయంలో 400 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఫ్లైట్ లో ప్రయాణించాల్సిన 400 మంది (IndiGo passengers) ఇస్తాంబుల్‌లోనే ఉండిపోయారు.

IndiGo Flights: ఇండిగో విమానాలు రద్దు.. ఎయిర్ పోర్టులోనే చిక్కుకుపోయిన 400 మంది ప్రయాణికులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో 400 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఫ్లైట్ లో ప్రయాణించాల్సిన 400 మంది (IndiGo passengers) ఇస్తాంబుల్‌లోనే ఉండిపోయారు. టర్కీ, ఢిల్లీ, ముంబై మధ్య రాకపోకలు సాగించాల్సిన రెండు ఇండిగో (IndiGo) విమానాలు రద్దయ్యాయి. దీంతో, ఈ పరిస్థితి ఏర్పడింది. విమానం రెండుసార్లు ఆలస్యంగా వస్తున్నట్లు ప్రకటన వెలువడిందని.. ఆపైన రద్దయినట్లు తెలిసిందని ప్రయాణికులు వాపోయారు. వరకు 12 గంటల తర్వాత రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారని వెల్లడించారు. ప్రయాణికులకు ఎలాంటి వసతి, భోజస సదుపాయం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండిగో ప్రతినిధి కూడా బాధితులను సంప్రదించలేదని తెలిపారు. చల్లనివాతావారణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.

అత్యంత చెత్త ఎయిర్ లైన్స్ గా..

ఇకపోతే, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ విమానాలు రద్దయ్యాయి. దాంతో ఇస్తాంబుల్ విమానాశ్రయం (Istanbul airport)లో చిక్కుకుపోయిన ప్రయాణికులు ఆహారం, వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమకు ఎదురైన ఇబ్బందులను ప్రయాణికులు ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ఎయిర్‌లైన్స్ కస్టమర్ సర్వీస్‌ అందించడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని ప్రయాణికులు ఆఱోపించారు. ప్రతి ప్రయాణీకుడికి క్షమాపణలు చెప్పి, న్యాయమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోవైపు, ఈ నెల ప్రారంభంలో ఎయిర్ హెల్ప్ (Air Help) స్కోర్ 2024 నివేదిక విడుదల అయ్యింది. ఇండిగోను ప్రపంచంలోని చెత్త ఎయిర్‌లైన్స్‌లో ఒకటిగా ఆ నివేదిక పేర్కొంది. మొత్తం 109 ఎయిర్ లైన్స్ కు ర్యాంకింగ్ లు ఇవ్వగా ఇండిగో.. 103వ స్థానంలో నిలిచింది. ఆ నివేదికలో ఎయిర్ ఇండియా 61వ స్థానంలో, ఎయిర్ ఏషియా 94వ స్థానంలో ఉన్నాయి.

Next Story