Dam collapses: 40 ఏళ్ల నాటి డ్యామ్ తెగి గ్రామంలోకి అకస్మాత్తుగా వరద.. ఏడుగురు మృతి

by Prasad Jukanti |

భారీ వర్షాలకు డ్యామ్ కూలిన ఘటన విషాదాన్ని నింపింది.

Dam collapses: 40 ఏళ్ల నాటి డ్యామ్ తెగి గ్రామంలోకి అకస్మాత్తుగా వరద.. ఏడుగురు మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఛత్తీస్ గఢ్ (Chhattisgarh) లోని బలరాంపూర్ (Balrampur) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. డ్యామ్ (Dam) తెగిపోవడంతో వరద నీరు దిగువ గ్రామాలను ముంచెంత్తింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. ధనేష్ పూర్ గ్రామంలో గత రాత్రి భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఇక్కడ ఉన్న 1980లో నిర్మిచిన పురాతన రిజర్వాయర్ కు బీటలు వచ్చాయి. వరద ఉధృతి పెరగడంతో ఒక్కసారిగా డ్యామ్ తెగిపోయింది. దీంతో గ్రామంలోని ఇళ్లు, పొలాల్లోకి ఆకస్మిక వరదలు సంభవించాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే గ్రామాన్ని వరద ముంచెత్తింది. ఈఘటలో ఇంట్లో నిద్రిస్తున్న ఒక మహిళ, ఆమె అత్తతో పాటు గ్రామంలోని మొత్తం ఏడుగురు మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది. పలువురు వ్యక్తులు కనిపించకుండా పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, జిల్లా యంత్రాంగం గ్రామానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. డ్యామ్ దిగువ గ్రామాలు మొత్తం నీట మునిగిపోవడంతో పరిస్థితి విషమంగా ఉందని సహాయక చర్యలకు ఇబ్బందిగా మారిందని అధికారులు చెబుతున్నారు.

Next Story