- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోల్ కతా హత్య కేసులో.. 40 నిమిషాలు ఆలస్యం!
కోల్ కతా వైద్యురాలి లైంగిక దాడి, హత్య కేసులో సీబీఐ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: కోల్ కతా వైద్యురాలి లైంగిక దాడి, హత్య కేసులో సీబీఐ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్ హాలులో 31 ఏళ్ల ట్రెయినీ వైద్యురాలి మృత దేహం కనుగొన్న తర్వాత.. జరిగిన ఘటనను స్థానిక పోలీసులకు తెలియజేయడంలో జాప్యం నెలకొన్నట్లు సీబీఐ గుర్తించింది. దాదాపుగా ఘటన జరిగిన 40 నిమిషాల తర్వాత మెడికల్ కాలేజ్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు సీబీఐ తెలిపింది. అయితే ఈ ఘటనను కప్పిపుచ్చేందుకే ఆస్పత్రి అధికారులు యత్నించి ఉండవచ్చని సీబీఐ అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది.
కోల్ కతా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతదేహాన్ని ఉదయం 9:30 గంటలకు గుర్తిస్తే.. తర్వాత 40 నిమిషాలకు అంటే ఉదయం 10:10 గంటలకు తాలా పోలీస్ స్టేషన్ కు మొదటగా సమాచారం అందించారు. ఆ మృతదేహం కనుగొన్న గంటకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నేరానికి సంబంధించిన స్థలాన్ని భద్రపరచడంలో ఒక గంట ఆలస్యమైంది. ఈ కేసులో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ జోక్యం చేసుకున్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు, అతని కాల్ డేటాను సీబీఐ పరిశీలిస్తోంది. శుక్రవారం నాడు 14 వ సారి ఘోష్ ను విచారణకు పిలిచారు. ఈ సంఘటనల క్రమంలో పోలీసుల ప్రతిస్పందన అర్ధం చేసుకునేందుకు తాలా పోలీస్ స్టేషన్ అధికారిని కూడా సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం.అయితే సీబీఐ చేసిన ఈ వాదనల్ని పోలీసులు తోసిపుచ్చారు. తాము మెడికల్ కాలేజ్ క్రైమ్ సీన్ లో 'రాజీ పడలేదు' అని వారు పేర్కొన్నట్లు తెలుస్తోంది. క్రైమ్ సీన్ మార్చబడిందన్న సీబీఐ వాదనల్ని కోల్ కతా పోలీసులు ఖండించారు.






