- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎర్రకోట ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాలు : అమిత్ షా
గత నెలలో ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

దిశ, వెబ్‌డెస్క్: గత నెలలో ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అది ఉగ్రదాడిగా నిర్ధారణ కావడం, దాడి వెనుక డాక్టర్లహస్తం ఉందని తేలడంతో దేశమంతా ఉలిక్కిపడింది. తాజాగా ఎర్రకోట పేలుడు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ పేలుడు ఘటనలో సుమారు 40 కిలోల పేలుడు పదార్థాలను వాడినట్లుగా తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో యాంటీ టెర్రరిజం కాన్ఫరెన్స్ 2025ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ పోలీసులు ఈ కేసు దర్యాప్తును అద్భుతంగా చేశారని, పేలుడుకు ముందే మూడు టన్నుల పదార్థాలను స్వాధీనం చేసుకుని, నిందితుల్ని ఢిల్లీ పేలుడుకు ముందే అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.
కేంద్రం.. వ్యవస్థీకృత నేరాలపై ఉక్కుపాదం మోపేందుకు కొత్త ప్రణాళికను తీసుకువస్తుందని, అత్యంత ముఖ్యమైన ఏటీఎస్ విధానాన్ని వీలైనంత త్వరగా దేశమంతా అమలు చేయాలని అన్ని రాష్ట్రాల డీజీపీలకు సూచించారు. కేంద్ర సంస్థలు, రాష్ట్ర పోలీసులు ఈ సాంకేతికతను వివిధ స్థాయిల్లో సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారని తెలిపారు.






