- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
4 వేల టన్నుల బొగ్గు మాయం.. వర్షాలపైకి నెట్టేసిన రాష్ట్ర ప్రభుత్వం.. హైకోర్టు సీరియస్
ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో ఇటీవల 4 వేల టన్నుల బొగ్గు అదృశ్యమైన సంగతి తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర హైకోర్టు జోక్యం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

దిశ, వెబ్ డెస్క్: ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో (Meghalaya) ఇటీవల 4 వేల టన్నుల బొగ్గు అదృశ్యమైన (Coal Missing) సంగతి తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర హైకోర్టు జోక్యం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, బొగ్గు అదృశ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే?
ఇటీవల మేఘాలయలోని రాజాజు, దియంగన్ గ్రామాల్లోని రెండు బొగ్గు నిల్వ కేంద్రాల నుంచి దాదాపు 4వేల టన్నుల బొగ్గు కన్పించకుండా పోయింది. ఈ ఘటనపై హైకోర్టు విచారణ చేపట్టి.. వెంటనే బాధ్యులను పట్టుకుని శిక్షించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై తాజాగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కీర్మెన్ షిల్లా స్పందించారు. మేఘాలయ దేశంలోనే అత్యంత ఎక్కువ వర్షపాతం నమోదయ్యే రాష్ట్రాల్లో ఒకటని తెలుపుతూ.. బొగ్గు మొత్తం భారీ వర్షాలకు బంగ్లాదేశ్, అస్సాంకు కొట్టుకుపోయి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. అయితే, ఈ విషయంలో కేవలం వర్షాన్నే నిందించలేమని, బొగ్గు అక్రమరవాణా జరిగినట్లు ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాల్లేవన్నారు. సంబంధిత అధికారులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారని, అక్రమ మైనింగ్‌కు పాల్పడే వారిని చట్టం ముందుకు తీసుకొస్తామని చెప్పారు. అయితే, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. అక్రమ మైనింగ్‌ను దాచిపెట్టేందుకే ఇలాంటి వాదనలు తీసుకొస్తున్నారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.






