- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లి పాలు తాగిన నాలుగు నెలల చిన్నారి మృతి
పంజాబ్ మొహాలీలో విషాదం చోటు చేసుకుంది. తల్లి పాలు తాగి పడుకున్న చిన్నారి సడెన్‌గా వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. పరీక్షలు నిర్వహించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబం దు:ఖంలో మునిగిపోయింది

దిశ, వెబ్ డెస్క్ : పంజాబ్ మొహాలీలో విషాదం చోటు చేసుకుంది. తల్లి పాలు తాగి పడుకున్న చిన్నారి సడెన్‌గా వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. పరీక్షలు నిర్వహించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబం దు:ఖంలో మునిగిపోయింది. మొహాలీలోని సెక్టార్ 82కు చెందిన పూజ నాలుగు నెలల కుమారుడు గోపాల్‌ను అపురూపంగా చూసుకునేది. రోజులాగే పాలు ఇస్తూ నిద్రపుచ్చింది. కానీ కాసేపటి తర్వాత పిల్లాడు అకస్మాత్తుగా వామిట్ చేసుకున్నాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. ఇదంతా చూసి భయపడిన కుటుంబం ఆస్పత్రికి తీసుకెళ్లగా మరణవార్త విన్నారు. పిల్లాడు నిద్రపోయినప్పుడు పాలు ఇవ్వకూడదని.. అలాంటి సమయంలో తల్లిపాలు ఇవ్వడంతో పాలు చిన్నారి ఊపిరితిత్తులకు చేరే అకాశాలు ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు. ఆ తర్వాత శ్వాసనాళానికి చేరి.. బిడ్డ మరణించవచ్చని హెచ్చరిస్తున్నారు.






