- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mumbai: వాటర్ ట్యాంక్ శుభ్రం చేయడానికి వెళ్లి నలుగురు కూలీలు మృతి
ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు బిస్మిల్లా స్పేస్‌లో నిర్మాణంలో ఉన్న బేస్‌మెంట్‌లో ఉన్న వాటర్ ట్యాంకులోకి ప్రవేశించారు.

దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణ ముంబైలోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా నలుగురు కూలీలు ఊపిరాడక మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. నగరంలోని నాగ్‌పాడలో ఆదివారం మధ్యాహ్నం ఈ విషాదం చోటుచేసుకుంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) తెలిపిన వివరాల రకారం, మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు బిస్మిల్లా స్పేస్‌లో నిర్మాణంలో ఉన్న బేస్‌మెంట్‌లో ఉన్న వాటర్ ట్యాంకులోకి ప్రవేశించారు. బేస్‌మెంట్‌లోని ట్యాంకులో ఉన్న ప్లైవుడ్ పరికరాలను తొలగించేందుకు ఒకరు వెళ్లగా, అతన్ని కాపాడేందుకు మరో నలుగురు దిగారు. వారిలో నలుగురు కార్మికులు ఊపిరాడక మరణించారని, మరొకరు అపస్మారక స్థితిలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ట్యాంకు లోపల విషపూర్తిత వాయువులు వెలువడటంతో కార్మికులు మరణించారు. వారిని అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చింది. ప్రాణాలతో బయటపడిన వ్యక్తి బలహీనత, ఊపిరి ఆడకపోవడం సహా ఇతర తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు జేజే హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు.






