12వ అంతస్తు నుంచి కిందపడిన చిన్నారి.. స్పాట్ డెడ్.. తప్పు తల్లిదేనా??(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-27 13:08:03  IST  )

మహారాష్ట్రలోని థానేలో విషాదం చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిని బయటకు తీసుకుని వెళ్తున్న తల్లి.. చెప్పులు వేసుకునేందుకు కిటికీ పక్కన కూర్చోబెట్టింది. కానీ పాప పైకి లేచి కిటికీ మీద కూర్చునేందుకు ప్రయత్నించగా.. స్లిప్ అయి కిందపడిపోయింది.

12వ అంతస్తు నుంచి కిందపడిన చిన్నారి.. స్పాట్ డెడ్.. తప్పు తల్లిదేనా??(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని థానేలో విషాదం చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిని బయటకు తీసుకుని వెళ్తున్న తల్లి.. చెప్పులు వేసుకునేందుకు కిటికీ పక్కన కూర్చోబెట్టింది. కానీ పాప పైకి లేచి కిటికీ మీద కూర్చునేందుకు ప్రయత్నించగా.. స్లిప్ అయి కిందపడిపోయింది. 12వ అంతస్తు నుంచి జారి పడగా.. స్పాట్‌లోనే చనిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా నెటిజన్లు తల్లిపై ఎటాక్ చేస్తున్నారు. కేవలం తల్లి చేసిన మిస్టేక్ వల్ల బిడ్డ ప్రాణాలు కోల్పోయిందనే క్యాప్షన్స్, కామెంట్స్‌తో విరుచుకుపడుతున్నారు. కాగా ఈ ఘటన అపార్ట్‌మెంట్స్‌లో పిల్లల భద్రతా చర్యల అవసరాన్ని హైలెట్ చేస్తుంది. విండో గ్రిల్స్ లేకపోవడం.. హౌసింగ్ డిజైన్‌లో సిస్టమిక్ వైఫల్యాలను సూచిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story