గంటల వ్యవధిలోనే రెండు సార్లు భూకంపం

by Malleboina Mahesh |   (  Updated:2023-02-28 06:04:32  IST  )

మంగళవారం ఉదయం 6.57 గంటలకు మేఘాలయలోని తురాలో భూకంపం సంభవించింది.

గంటల వ్యవధిలోనే రెండు సార్లు భూకంపం
X

దిశ, వెబ్‌డెస్క్: మంగళవారం ఉదయం 6.57 గంటలకు మేఘాలయలోని తురాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.7 గా నమోదైనట్లు..నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. కాగా మణిపూర్ లోని నోనీలో అర్ధరాత్రి 2.46 గంటలకు 3.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. కాగా గంటల వ్యవధిలోనే ఈశాన్య ప్రాంతంలో రెండు భూకంపాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. మేఘాలయలో వచ్చిన భూకంప కేంద్రం 29 కి. మీ లోతులో ఉన్నట్లు NCS తెలిపింది. కేవలం 5 గంటల వ్యవధిలోనే రెండు భూకంపాలు రావడం తో ఈశాన్య ప్రాంతాలు( కొండ ప్రాంతం) భయంతో జంకుతున్నారు.

Next Story