- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్కూల్లో మధ్యాహ్న భోజనం చేసి అస్వస్థతకు గురైన 365 మంది విద్యార్థులు
తమ దేశంలోని పేద పిల్లలకు పోషకాహారం అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. అయితే, తాజాగా ఈ కార్యక్రమంలో ఘోర విషాదకర ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కార్యక్రమం (Mid Day Meal Program) గురించి అందరికి తెలిసిందే. మన దేశం తరహాలోనే అమెరికా, బ్రెజిల్, జపాన్ వంటి అనేక దేశాల్లో ఈ పథకం అమలు చేస్తున్నారు. పేద బాల బాలికలకు పోషకాహారం అందించటంతో పాటు పేదరికం కారణంగా పాఠశాలకు వెళ్ళడం మానివేయకూడదనే ఉద్దేశంతో ఆయా దేశాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా అన్ని పని దినాలలో విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్నం భోజనం పెడతారు. ఇండోనేషియా కూడా తమ దేశంలోని పేద పిల్లలకు పోషకాహారం అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. అయితే, తాజాగా ఈ కార్యక్రమంలో ఘోర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ఇండోనేషియాలోని (Indonasia) సెంట్రల్ జావాలోని స్రాగెన్ పట్టణంలోని పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం తిని 365 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరు తీవ్రమైన కడుపు నొప్పి, తలనొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ ఘటన అనంతరం స్థానిక అధికారులు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాలను తాత్కాలికంగా నిలిపివేసి, ఆహార నమూనాలను పరీక్షించేందుకు ల్యాబ్‌కు పంపిచారు. ఈ సమస్యకు కారణం పసుపు అన్నం, గుడ్డు స్క్రాంబుల్, వేయించిన టెంపే, కీరదోస సలాడ్, పాల బాక్స్‌తో కూడిన భోజనం అని అనుమానిస్తున్నారు. ఇవి ఒక కేంద్రీయ వంటశాలలో తయారై, పలు పాఠశాలలకు పంపిణీ చేశారు. ఘటనపై ప్రభుత్వం స్పందించింది. విద్యార్థులకు మెరుగైనా వైద్యం అందించాలని, వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించింది.
కాగా, ఇండోనేషియా ప్రభుత్వం ఉచిత మధ్యాహ్న భోజనం పథకం ద్వారా 80 మిలియన్ల పాఠశాల పిల్లలకు ఆహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా సుమారు 28 బిలియన్ డాలర్లను కేటాయించినట్లు సమాచారం. పలు మంత్రిత్వ శాఖలకు సైతం బడ్జెట్‌లను తగ్గించింది. అయితే, ఈ ఏడాది జనవరిలో ఈ కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. అయితే, ఇప్పటివరకు చోటుచేసుకున్న ఘటనలో ఇదే అతి పెద్ద విషాదంగా స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి.






