భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన 40 ఏళ్ల తర్వాత.. 337 టన్నుల విషపూరిత వ్యర్థాలు దహనం!

by Phanindra |

భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన 40 ఏళ్ల తర్వాత.. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలోని 337 టన్నుల విషపూరిత వ్యర్థాలు దహనం చేసినట్లు అధికారులు తెలిపారు.

భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన 40 ఏళ్ల తర్వాత.. 337 టన్నుల విషపూరిత వ్యర్థాలు దహనం!
X

దిశ, నేషనల్ బ్యూరో: యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన 337 టన్నుల వ్యర్థాలను దహనం చేసినట్లు అధికారులు తెలిపారు. పొల్యూషన్ బోర్డు అధికారులు ఈ వ్యర్థాలను ప్రోటోకాల్ ప్రకారం నాశనం చేసినట్లు భోపాల్ గ్యాస్ ట్రాజెడీ రిలీఫ్ అండ్ రీహాబిలేషన్ డైరెక్టర్ స్వతంత్ర కుమార్ సింగ్ వెల్లడించారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన 40 ఏళ్ల తర్వాత ఈ ప్రమాదం జరిగిన యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి విషపూరిత వ్యర్థాలను తొలగించే ప్రక్రియను జనవరి 1న ప్రారంభించారు. మొత్తం 12 కంటైనర్లలో 337 మెట్రిక్ టన్నుల ప్రమాదకరమైన వ్యర్థాలను పిఠాంపూర్‌లోని రీ-సస్టైనబిలిటీకి చెందిన ప్రైవేటు డిస్పోజల్ ప్లాంట్‌లో దహనం చేసినట్లు అధికారులు తెలిపారు.

Next Story