- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపరేషన్ సింధు..స్వదేశానికి మరో 310 మంది భారతీయులు
ఆపరేషన్ సింధు పేరుతో ఇరాన్ నుండి భారతీయులను కేంద్రం స్వదేశానికి తరలిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో 310 మంది భారతీయులను కేంద్రం స్వదేశానికి తీసుకువచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సింధు పేరుతో ఇరాన్ నుండి భారతీయులను కేంద్రం స్వదేశానికి తరలిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో 310 మంది భారతీయులను కేంద్రం స్వదేశానికి తీసుకువచ్చింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 827 మందిని భారత్‌కు తీసుకువచ్చినట్టు విదేశాంగశాఖ వెల్లడించింది. అంతే కాకుండా ఇజ్రాయెల్ నుండి భారతీయులు స్వదేశానికి రావాలని, ఇందులో భాగంగా భారత రాయభార కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే జరిమానా లేదా జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందనే ప్రచారాన్ని ఖండించింది. ఇదిలా ఉంటే ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం జరగుతోంది. తొమ్మిది రోజులుగా రెండు దేశాలు దాడులు చేసుకుంటున్నాయి. ఒక దేశంపై మరో దేశం మిస్సైల్స్‌తో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో భారత్ అక్కడ నివసించే భారతీయులు స్వదేశానికి రావాలని సూచించింది. ప్రత్యేక విమానాల్లో వారిని స్వదేశానికి రప్పిస్తోంది.






