జమ్మూ కశ్మీర్ యువతలో దేశభక్తి.. టెరిటోరియల్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు పోటెత్తిన 30 మంది

by Malleboina Mahesh |

ఇండియన్ ఆర్మీకి చెందిన రోమియో ఫోర్స్ ఆధ్వర్యంలో పూంఛ్ జిల్లాలోని సురన్‌కోట్ పట్టణంలో నిర్వహిస్తున్న టెరిటోరియల్ ఆర్మీ (TA) రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు భారీ స్పందన లభించింది.

జమ్మూ కశ్మీర్ యువతలో దేశభక్తి.. టెరిటోరియల్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు పోటెత్తిన 30 మంది
X

దిశ, వెబ్ డెస్క్: జమ్ము కశ్మీర్ యువతలో దేశ సేవ పట్ల అపారమైన ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇండియన్ ఆర్మీ (Indian Army)కి చెందిన రోమియో ఫోర్స్ ఆధ్వర్యంలో పూంఛ్ జిల్లాలోని సురన్‌కోట్ పట్టణంలో నిర్వహిస్తున్న టెరిటోరియల్ ఆర్మీ (Territorial Army) రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు (Recruitment drive) భారీ స్పందన లభించింది. ఈ నియామక ప్రక్రియలో కేంద్రపాలిత ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏకంగా 30,000 మందికి పైగా యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. టెరిటోరియల్ ఆర్మీలో భాగమై దేశ సేవలో పాలుపంచుకోవాలనే ఆకాంక్షతో యువత పెద్ద సంఖ్యలో తరలిరావడం విశేషం. ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) తర్వాత చేపట్టిన ఈ నియామకాల ప్రక్రియ (Recruitment process) డిసెంబర్ 15వ తేదీ వరకు కొనసాగనుంది. పూంఛ్ జిల్లా సురన్‌కోట్ పట్టణం (Surankot town) లో నిర్వహిస్తున్న ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా దేశ రక్షణలో భాగమయ్యేందుకు జమ్ము కశ్మీర్ యువతకు గొప్ప అవకాశం లభించింది.

Next Story