జమ్మూలో 30 మంది ఉగ్రవాదులు.. సెర్చ్ ఆపరేషన్

by Muthe.Rajitha |

జమ్మూ ప్రాంతంలో 30 నుంచి 35 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు సంచరిస్తున్నారని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేసాయి.

జమ్మూలో 30 మంది ఉగ్రవాదులు.. సెర్చ్ ఆపరేషన్
X

దిశ, వెబ్ డెస్క్ : జమ్మూ ప్రాంతంలో 30 నుంచి 35 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు సంచరిస్తున్నారని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేసాయి. ఈ నేపథ్యంలో భారత సైనికులు సెర్చ్ ఆపరేషన్లను చేపట్టారు. ముఖ్యంగా కిష్ట్‌వార్‌, దోడా జిల్లాల్లోని ఎత్తైన పర్వత ప్రాంతాలు, తీవ్రమైన మంచుతో కప్పబడిన అడవుల్లో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శీతాకాలాన్ని ఆసరాగా చేసుకుని ఉగ్రవాదులు దాక్కునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, సైన్యం తాత్కాలిక బేస్‌లు, నిఘా పోస్టులు ఏర్పాటు చేసి వారిపై నిరంతర నిఘా పెంచుతోంది.

డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు, గ్రౌండ్ సెన్సార్ల సహాయంతో ఉగ్రవాదుల కదలికలను ట్రాక్ చేస్తున్నారు. ఆర్మీతో పాటు జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌, ఫారెస్ట్ గార్డులు, విలేజ్ డిఫెన్స్ గార్డులు సమన్వయంతో ఈ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. గతంలో శీతాకాలంలో ఉగ్ర కార్యకలాపాలు తగ్గేవి కానీ, ఇప్పుడు సైన్యం ప్రోయాక్టివ్ వింటర్ వ్యూహంతో ఉగ్రవాదులకు ఎలాంటి సేఫ్ హేవెన్ లేకుండా చేస్తోందని ఆర్మీ అధికారులు చెబుతున్నారు.

Next Story