- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Indian Drones: ఈ డ్రోన్ కన్ను పడితే శత్రువు మటాష్.. పాక్ సైన్యానికి నిద్ర లేకుండా చేస్తున్న భారత డ్రోన్లు ఇవే.
Indian Drones: భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దుల వద్ద తీవ్రమైన ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: Indian Drones: భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దుల వద్ద తీవ్రమైన ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రతీకార జ్వాలతో రెచ్చిపోతూ సరిహద్దుల్లో ఉన్నగ్రామాల పైన, పట్టణాల పైన పౌరుల నివాసాల పైన మిసైల్స్, డ్రోన్స్, మోర్టార్ షెల్స్ తో దాడులకు తెగబడుతోంది. అటు పాకిస్తాన్ చేస్తున్న ఈ దాడులను భారత్ వద్ద ఉన్న S-400 వంటి ఆధునిక యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టం ద్వారా సమర్థవంతంగా తిప్పి కొడుతోంది. అయితే భారత్ కూడా పాకిస్తాన్ పైన ఎదురుదాడికి దిగుతోంది.
పాకిస్తాన్ చేస్తున్న కుయుక్తులకు గట్టిగా సమాధానం చెబుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్ వదులుతున్న క్షిపణులను అడ్డుకునేందుకు వాటిని గగనతలంలోనే పేల్చివేసేందుకు యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టం ద్వారా మిస్సైల్స్ వాడుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ కు చెందిన F16 జెట్ విమానాన్ని సైతం భారత వైమానిక దళం కూల్చివేసినట్లు ప్రకటించింది. మరోవైపు భారత తరఫునుంచి కూడా శక్తివంతమైన డ్రోన్స్ పాకిస్తాన్ కు గట్టి సమాధానం చెబుతున్నాయి. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ లో కూడా ఈ డ్రోన్స్ వాడినట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఆ డ్రోన్స్ గురించి తెలుసుకుందాం.
IAI Harop (హారోప్) డ్రోన్లు: ఇజ్రాయిల్ సాంకేతిక టెక్నాలజీతో తయారైన ఈ డ్రోన్స్ లక్ష్యాన్ని గుర్తించి నేరుగా వెళ్లి దాడి చేస్తాయి. అంతేకాదు ఈ డ్రోన్స్ ను ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ లో భారత వాయుసేన పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఉపయోగించింది.
SkyStriker డ్రోన్స్: ఇవి బెంగళూరులో తయారైన సూసైడ్ డ్రోన్స్. భారత సైన్యం "ఆపరేషన్ సిందూర్"లో ఈ డ్రోన్లను పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఉపయోగించింది.
టార్గెట్ లక్ష్యాలను ఛేదించడానికి డ్రోన్స్ చాలా చక్కగా ఉపయోగపడతాయి వీటిలో ఎలాంటి పైలెట్ వ్యవస్థ ఉండదు ఆటో పైలెట్ గా వీటిని దూరం నుంచే ఆపరేట్ చేయవచ్చు. డ్రోన్స్ ఉపయోగించడం వల్ల టార్గెట్ లక్ష్యాన్ని నిర్మూలించవచ్చు. పైలట్ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం జరగదు.






